పుట:ఉదాహరణపద్యములు.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8 శివస్తుతి

సీ. గరళకూటవినీలకంఠాయ శంభవే
మదనాంతకాయోన్నమఃశివాయ
కాద్రవేయాధిప గ్రైవేయభూషాయ
మధుజిత్సకాయోన్నఃశివాయ
కుంభినీధరసుతాకుచకుంభపరిరంభ
మహలోలుపాయోన్నమఃశివాయ
వేదాదినిశ్శేషవిద్యావధూమౌళి
మణికలాపాయోన్నమఃశివాయ
గంధదంతావళజలంధరాంధకాది
విబుధపరిసంధివాహినీనిబిడగర్వ
బంధఘోరాంధకారసంభారకిరణ
మాలినే శాశ్వతాయోన్నమఃశివాయ.

(శ్రీనాథుని భీమఖండము 3.210)



ఉ. వాలినభక్తి మ్రొక్కెద నవారితతాండవకేలికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మమయూఖమాలికిన్
బాలశశాంకమౌళికిఁ గపాలికి మన్మథగర్వసర్వతో
న్మూలికి నారదాదిమునిముఖ్యమనస్సరసీరుహాలికిన్.

(బమ్మెర పోతరాజు – బాగవతము)



సీ. పాతాళకుహరంబు సరగు సొమ్ములపెట్టె
వెలుకుగుబ్బలి పెద్దకొలువుమేడ
కలశపాథోరాశి కరమొప్పు వంటిల్లు
మలగి పారెడు నీరు మ............
శరథికూఁతురు గుబ్బచనుదోయి కనదొన
విద్దుఁ దాపసునెమ్ము వింటిబద్ద