పుట:ఉత్తరహరివంశము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

43


రములఁ గృపఁ జూచి మీయందు రథము నడవం
దెఱపి యిం డన్న ననియు నత్తెరఁగు చేసె.

47


క.

అంతట నేడునగంబులు
నంతర్ధానంబు [1]చేసి యట చనఁగా న
త్యంతభయంకరకర్దమ
సంతమసంబున రథంబు సాగక నిలిచెన్.

48


మ.

మఱియుం జీఁకటికొండ చందమయినన్ మాకెల్లఁ బాతాళము
న్దఱియం జొచ్చు తెఱంగు దోఁచె నచటనే దైత్యాంతకుం డుద్ధతి
న్నఱకెం దత్తిమిరంబు నంబుధములోనం దోఁచుదంభోళిద
[2]గ్గఱుచుట్టం బన విక్రమక్రమణచక్రక్రీడ శోభిల్లఁగన్.

49


శా.

ఆకాశంబు వెలుంగఁ దోఁచె నడ పో నత్యద్భుతాకారుఁడై
రాకాచంద్రదివాకరానలశిఖారత్నప్రభాజాలరే
ఖాకాంతింబురుషుం డొకం డచట లోకం బెల్ల నిండించినన్
మాకన్నుఁగవ లిట్టిరూప మని నమ్మజాలవయ్యె న్నృపా.

50


క.

నను నవ్విప్రుని నచ్చో
నునిచి జగన్నాథుఁ డఖిలయోగనిధి జనా
ర్దనుఁ డాతేజములో[3]నం
జనఁ జొచ్చె న్మగుడఁ దెచ్చెఁ జచ్చినసుతులన్.

51

కృష్ణుఁడు విప్రకుమారులఁ దెచ్చి యిచ్చి ద్వారకకు వచ్చుట

తే.

ఎవ్వఁ డెయేఁట బుట్టె నయ్యేటి[4]వయసు
సుతుల మువ్వుర నాఁడు గన్నతనిఁ గూర్చి
యిచ్చె నలువుర సుతుల మహీసురునకు
వచ్చితిమి క్షణంబున ద్వారవతికి నేము.

52


మ.

దివసార్ధంబునఁ జోయి వచ్చుట ధరిత్రీనాథ చిత్రంబు భ
క్తవిధేయుం డగు దేవదేవుని ప్రసాదం బెట్టిదో యేము బాం

  1. చేసె నట (ఉ-హరి-4)
  2. గ్గఱుచందంబున
  3. ఁజొచ్చెన్ దెచ్చెన్ జచ్చినట్టి శిశువుల
  4. ప్రాయమైన