పుట:ఉత్తరహరివంశము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ఉత్తరహరివంశము


వానిలో నిపిశాచముల్ వచ్చి వచ్చి
పొదువ నన్నింటిఁ దునుకలప్రోవు చేసె.

140


మ.

కని శౌరిన్ మురుఁ డంత మార్కొని గదాఘాతంబుల న్నొంచి [1]మీఁ
ద నవార్యాద్భుతశక్తి వైచుటయుఁ గోదండంబు సారించి య
ద్దనుజారాతి శితక్షురప్రమునఁ దత్కంఠంబు ఇండిచి శం
ఖనినాదంబున భూనభోంతరభయోత్కంపంబు గావించినన్.

141


ఉ.

అంత నిశుంభుఁ [2]డెయ్దుకొని యాశుగముల్ దనమీఁద నేయ దై
త్యాంతకుఁ డంతకంతకు గదాహతి నొవ్వఁగ సత్యభామ దు
ర్దాంతమదంబుతో ఘనగదం గడు బెట్టుగ వైచె దైత్యు న
త్యంతరయంబునన్ రుధిరధారలు గ్రక్క రణాంగణంబునన్.

142


క.

ఆలోకించి మురాంతకు
డాలోననె శరపరంరాంభోనిధిక
ల్లోలములఁ దేల్చి వానిం
గాలుని కందిచ్చె రౌద్రఘనవాయుగతిన్.

143


శా.

కేలీవిక్రముఁడైన చక్రికి హయగ్రీవుండు మార్కొన్న నా
భీలాయోధన మయ్యె నయ్యెడ శరప్రేంఖడ్గళోద్వేలకీ
లాలాలోలము చేసి వానితల నేలం గూల వైచెన్ జయ
శ్రీలోలుండు మురారి పంచజనుఁ బంచెం దత్సహాయుండుగాన్.

144


వ.

ఇట్లు విజృభించి దనుజాంతకుఁడు.

145


క.

ప్రాగ్జ్యోతిషంబు గదిసి స
దృగ్జ్యాటంకృతులు లేక దితిజులమీఁదన్
దృగ్జ్యోత్స్న జేవురింపఁగ
దిగ్జ్యాగగనాంతరంబు దివురఁగ నార్చెన్.

146


క.

విని కడగి యసుర లెనుఁబది
యెనిమిదివే లొక్కమొగిన యెత్తిన హరియం

  1. యం, తప చక్రం బటుమీఁద వైచుటయు
  2. డాదిగొని