పుట:ఉత్తరహరివంశము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ఉత్తరహరివంశము


న్యాసక్తిఁ గౌఁగిలింపఁగ
నాసభవారలకు ముదము నచ్చెరు వయ్యెన్.

125


వ.

ఇట్లు పరస్పరపరిరంభణం బాచరించిన యనంతరంబ జంభాంత
కుండు.

126


శా.

రాముం గౌఁగిటఁజేర్చి [1]యాహుకుని నాప్రద్యుమ్ను నక్రూరునిన్
బ్రేమం బారఁగఁ గౌఁగిలించి వరుసన్ బేర్వేర భోజాంధక
స్తోమం బెల్ల వయోవిశేషగతి రాఁ దోడ్తోఁబరీరంభలీ
లామాధుర్యమునన్ సుఖాంబునిధిఁ దేలం జేసె నెయ్యంబునన్.

127


మ.

హరి చేయించిన యర్ఘ్యపాద్యమధుపర్కాద్యోపచారంబులన్
హరి సమ్మోదము మోమునం బొడమఁగా నర్హాసనాసీనుఁడై
కరమద్దేవు కపోలఫాల[2]చిబుకగ్రైవేయసంక్రీడకుం
దిరుగం జేయుచు నొయ్యనొయ్యఁ జెవికిం దియ్యంబుగాఁ బల్కుచున్.

128


క.

నరసీరుహసంభవుచే
నరకుం డేవరము వడసి నమ్మినవాఁడో
పురములు గైకొని [3]కొఱఁకుల
తెరువులఁ బట్టించె నన్ను దిక్పాలకులన్.

129


వ.

అంతనుండి.

130


చ.

చొరనిబిలంబులున్ వెడలఁజూడని క్రంతలు గాలు రాపడం
దిరుగని త్రోవలున్ విడియఁ దీర్పరిగొందులు నాలుబిడ్డ లే
కరయని రేలుఁ జీమ చిటుకన్నను విప్పనిమూఁకలు బయిం
జిరుఁగని చీరలుం గలవె చేరిన యీ సురకోటి కచ్యుతా.

131


వ.

నా తెఱంగు వినుము.

132


శా.

లోకాలోకనగంబు [4]చెంపలకుఁ గల్లోలాహతాంబోధివే
లాకుంజంబులకుం జనం జనఁగ నాలా [5]వెంత చింతాభరం

  1. సాత్యకిని నాప్రద్యుమ్ను నక్రూరునిన్ (a) సత్యకసుతున్ రాజేంద్రు నయ్యాహు, (b) సాత్యకిని.
  2. వంక
  3. కొండల
  4. డాపలకు (దెంపలకు); డంపులకు; చెంపలకు.
  5. వేది