పుట:ఉత్తరహరివంశము.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[1]సీ.

పురుడు వచ్చిననాఁడ పూతనామోతన
                 స్తన్యజీవితములు చవులు సూచె
వెన్న మ్రింగెడినాఁడ వెడద [2]పుక్కిటిలోని
                 జగము వల్లవరాజసతికిఁ జూపెఁ
దడవి యాడెడునాఁడ దనుజరూపములైన
                 మద్దుల యుద్దులు మలఁగఁజేసె
నడవ నేర్చిననాఁడ పుడమి వ్రేఁగంతయుఁ
                 బాపఁబూనిన తనపనులు దెలిపెఁ


గీ.

గాచె శరణాగతులఁ బశుగణము గాచెఁ
గేల గిరి యెత్తె నెత్తెఁ బాంచాలిమాన
మనఁగఁ బొగడొందు దేవర నాశ్రయింతు
జిష్ణసఖుఁ గౌస్తుభాలంకరిష్ణుఁ గృష్ణు.

  1. ప్రస్తుత ముద్రిత యుత్తరహరివంశమున నీ పద్యము లేదు. దీనిని పూర్వహరివంశములోనిదిగా నడకుదిటి వీరరాజుగారు భావించిరి.
  2. పొక్కిలి