పుట:ఉత్తరహరివంశము.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

ఉత్తరహరివంశము


వ.

అని యప్పుడు.

194


క.

దనుజుం డాడెడు వచనము
అనేకపకరాగ్రశీకరాకృతిఁ బోలెన్
ఘనవాత[1]తరంగముల జ
లనిధి నడుమనుండు నేఱులంబోలె వెసన్

195


క.

అప్పుడు జగములు గాల్పఁగ
నుప్పొంగుచు నున్న నిర్జరోత్తమబింబం
బొప్పు వెసఁ దాల్చె దనుజుం
డప్పరుసున నాడుచుండ నతని నయనముల్

196


వ.

తదనంతరంబ సరోషసంభ్రమోత్సాహదీపితుం డై నారాయణుం
డతని కిట్లనియె.

197


ఉ.

ఏమిర బాణ! వ్రీడన విహీనభయోద్దుతమానసుండ వై
యే మని పెక్కులాడెద విదేటికి మాటల జేత [2]నివు సం
గ్రామము గెల్వవచ్చునె వికారపుమాట జయంబ[3]యేని నీ
కీమెయి నేల భాషితము లెక్కుడు గాఁ బచరింపు మాజిలోన్.

198


క.

ఈ చందమైన విజయము
నీచే నగుఁ గాక యున్న నిక్కిపుజయముం
జూచెద వైనను నోరీ!
నాచే జితుఁ డగుము గెలువు నన్నును నీవున్ .

199

కృష్ణ బాణాసురుల యుద్ధము

క.

అనుచు నిశాతాశుగములు
దనుజునిపై నేయ నతఁడు దద్చరములకున్
మనమున విస్మయ మందుచు
ననేకబాణముల నేసె నంభోజాక్షున్.

200
  1. తరంగంబుల, నెనయ జలధినడుమ నుండు నేఱులఁ బొలెన్
  2. నీవు సం
  3. యైన నిం, కేమియు నేం