పుట:ఉత్తరహరివంశము.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

ఉత్తరహరివంశము


కృతరోషావేశుం డై విశాఖుండు సంబద్ధఘంటాసమూహదీర్ఘఘర్షరనిర్ఘోషం
బును వితతసువర్ణప్రభాశిఖాజాలంబును జయలక్ష్మీవినిర్మితనారాయణనీరాజనక్రియ
ననుకరించు హేమమయం బగు శక్తిం బ్రయోగించిన.

179


శంకాకీర్ణమనస్కదానవరిపుల్ చక్రాయుధుం డింతతోఁ
గుంకెంబో యని భీతులయిరి యచటం గ్రోధాప్తదీప్తిన్ మహా
హుంకారంబున శక్తిఁ గూల్చె విమతవ్యూహంబు భీతిల్ల నా
తంకంబుం బెడఁబాసి విష్ణుఁడు జగత్ప్రఖ్యాతచారిత్రుఁడై.

180


ఆ.

[1]అంతఁ బోక శౌరి యగ్రజుండును దాను
జక్రమును హయంబుఁ జటులగదయు
భుజములందుఁ దాల్పఁ బొరిఁబొరిఁ గదిరెడు
భీతి మానసమునఁ బిచ్చలింప.

181


వ.

గుహుండు చేయునది లేక తిరుగంబడినఁ బూర్వజయుతుండై (పూర్వ
గీర్వాణుం డగుబాణు నజేయు) హృషీకేశుండు సమయింపం దలంచి వెంటందగులు
నవసరంబునం గోటవియన నొక్కయుచ్చమల్లి వచ్చి యడ్డపడిన నగ్నికం జూచి
నారాయణుఁడు మాఱుమొగంబు వెట్టికొని యప్పుడు ద్వాదశవర్షంబులు నన్నుం
గొలిచిన ఫలంబు ని న్నొకమరి చూచినం జెడునని శపించె నది మొదలుగా
నానగ్నిక దిగంబర యై నవ్విధంబున.

182


మ.

జ్వరుఁడున్ శంకరుఁడుం గుమారుఁడు మహా[2]సైన్యంబు సన్నాహసు
స్థిరలీలం డిగఁద్రావి దానవవిభుశ్రేయోవిశేషాదిక
స్ఫురితశ్రీఁ బెడఁబాసి సంతతమహాశూరాగ్రణీసద్యశ
స్సరణుల్ బెండువడం దొలంగిరి మహాసంగ్రామరంగంబునన్.

183


వ.

ఇవ్విధంబున సగుహజ్వరుండై ఖండపరశుండు పాఱిన సురపద్యా
విరాజమానారరనిర్ఝరిణీప్రవాహశంకాసంపాదననిదాననిరంతరవైజయంతీ

  1. అంతఁ బోవక శౌరియు నగ్రజుండు
    చక్రమును శార్ఙ్గము హలంబు చటులగదయు
    భుజములందుఁ దాలుప బొరిబొరిఁ దిరిగెడు
    భీతిచే మానసంబును పిచ్చలింప.
  2. సైన్యౌఘసన్నాహసు