పుట:ఉత్తరహరివంశము.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

ఉత్తరహరివంశము


వ.

అనుటయుం బతంగపతి వసుమతికి నవతరించి వసుదేవసుతుని తలంపున
కనుగుణంబుగ నడచి కడచి ముంగిలియై జంగిలి వెలుచు గోపాలు పోలికం
బ్రతిబలంబులం గదలించియు నదలించియుఁ గడంగి యీటడంగి తాళఫలంబులు
డులుచు పెలుచునం బొదివి పెల్లొదివి హస్తికుల మస్తకంబుల ధర నురలిం
చియుఁ బొరలించియు ముంచి మెయిమెంచి మించిన తురగదళంబులం బొలి
యించియు నరదంబులు చెక్కలు వాయ ఱెక్కల విదిచియు నద్రిచియుఁ
బేరెలమిం దంపడినవీరుల నారెలం జీరి నారులు వోసినట్లు చేసియు మెండు
కొనియున్న శుండాలంబుల తొండంబులు వట్టికొని గుండెలు వగులందన్నియుఁ
గడిమిఁ గడచన్న పన్నగయక్షరాక్షసులఁ బెడచేత వ్రాసియు డాసియుఁ
బాసియు లాసియు వాసి చెడక కలకలంబులు సేయ పలకలవారి కనుంగు
టంబుల నింగికిం జిమ్మియు పఱిపఱిగా నఖంబుల వ్రచ్చియు విచ్చియు
జోచ్చియుఁ బెచ్చు పెరిఁగి వచ్చు బేతాళంబులం బాతాళంబు సొర నడిచియుఁ
బిడిచి వైచిన చందంబున మడఁచి త్రోచియు సరసాన బెరసినం గరసాన నొరసిన
వెరవు చేసియు గేడించినఁ గూడించి యడంచియుఁ బెల్లగిల్లిన మల్లడి గొలిపియు
ననే ప్రకారంబులం జీకాకు పఱిచె నట్టియెడ.

66


శా.

ఈషాదండము సీరతుండము ననిన్ హేరాళమై మూఁకలా
ఘోషింపంగ విహంగమాధిపనఖాంకూరంబు ధీరంబుగా
శేషాహిం గొనివచ్చి చొచ్చి రిపులం జెండాట సూచింపఁగా
రోషోద్రేకముఁ జూపుచుండె బలభద్రుం డుల్లసద్రౌద్రుఁడై.

67


ఉ.

నాఁగలి సాఁచుచుం దిగుచు నాగరథాశ్వభటావళిం గదన్
జాఁగరగొన్న జక్కులఁ బిశాచిక లాచిఱునుగ్గు [1]లెక్కకై
రేఁగినచోట్లనుం దెలుపు రెండునుమూఁడును నాలుగైదుగాఁ
గౌఁగిటఁ గొమ్ములు న్నొగలుఁ గాళులు వ్రేళులుఁ బట్టి చూపుచున్.

68


శా.

ద్యుమ్నంబు న్నికషంబు వోలెఁ బగఱన్ దోఃఖడ్గమున్ రాయఁ బ్ర
ద్యుమ్నుం డాహవకేళి సేయునెడఁ దోడ్తో భూతముల్ ప్రీతితో
నామ్నాయాగతభూతమాంసములు చేయారంగఁ [2]గూర్చున్ వెసన్
నిమ్నోత్తానతలంబు లొక్కమొగిగా నిండా[3]ర బండారమున్.

69
  1. వేఱుచో
  2. మార్చున్
  3. రు—ముల్