పుట:ఉత్తరహరివంశము.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

ఉత్తరహరివంశము


ఉ.

ముద్దీయ ముద్దరా ల్వెనుక ముందట నొండొకకీడు లే దనం
బెద్దలకెల్ల బాట నయి పెట్టినపీఁటన యుండ నైతి నా
బుద్ధులు దప్పె నేమిటికిఁ బోయిననీళ్ళకుఁ గట్ట వెట్ట నీ
యద్దములోనినీడ కెటు లాసపడం బొసఁగుం దలోదరీ.

155


ఉ.

ధీరుల నింద్రముఖ్యు లగుదిక్పతులం గుతి[1]లాలఁ బెట్టు న
వ్వీరుడు బాణుఁ డేమిటికి వియ్యపు[2]టిచ్చకుఁ దెచ్చు మర్త్యులన్
దూరపువారిఁ దన్విఁ గన నువ్వులఁ గండ్లను నోరఁబోసికొ
న్నారము కాఁ దలంపు లలనా యిలనాడెడు ప్రాణమేటికిన్.

156


గీ.

దనుజకులవైరి శౌరి నందనులు నట్ల
రక్కసులు మనవారు వారలకు మనకు
బొసఁగునె నడుమఁ బెట్టినపూరి గాలు
నేల చిత్రరేఖా తుది నింత సణుగు.

157


వ.

అట్లుగాక నామీఁదినెయ్యంబున నీవు విచారించిన తెఱంగు.

158


మ.

వనితా నీపతితోడఁ గూడ వలతేన్ వారేల వీరేల నీ
కని నన్నా యనిరుద్ధుఁ డున్నయెడ కెట్లయినన్ వెలార్తేనిఁ బో
యిన నాతండు కులాభిమానఘనుఁడై యేయూరి కేత్రోవయం
చనుమానించినఁ ద్రోవ నన్ గొఱవిఁ జేయం జూచెదే క్రమ్మఱన్.

159


వ.

మఱియు నొక్క తెఱంగు విను మక్కుమారు నిక్కడకుం గొని వచ్చి
తన్నుం గలుపు సామర్థ్యంబు గలదేని.

160


క.

కలసెదఁ బతి నతఁ డిచ్చట
మెలఁగుట మాతండ్రి విన్న మే లగునే ప్రే
వులలోన సురియఁ ద్రిప్పిన
కలపనఁ [3]బిండైనఁ జెలిమికత్తెలు నగరే.

161


ఉ.

నావుడుఁ జిత్రరేఖ వదనంబుం బింకము మీఱఁ బల్కు నా
లావున నిప్డు దెత్తు నబలా విభు నింపెసలారఁ గూడి సం

  1. లం గలంచు
  2. టంచుకు
  3. బిందైనఁ