పుట:ఉత్తరహరివంశము.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

ఉత్తరహరివంశము


ప్పుడు మగఁ డంచుఁ గోరుటకుఁ బొందుగఁ జెప్పితి ముల్లు పుచ్చి కొ
ఱ్ఱడఁచినచంద మయ్యెఁ గమలానన యీ విరహానలంబునన్.

101


క.

నీముడిచినముడి విడువగ
నే మెవ్వరు నేర మింక నీ సౌభాగ్య
శ్రీమహితునిఁ బతిఁ గూర్పం
గామిని నీకంటెఁ జెలులు గలరే చెపుమా.

102


చ.

అనుటయుఁ జిత్రరేఖ దనుజాధిపనందనతోడ ని ట్లనున్
నినుఁ గలలోనఁ జై బైపడిన నేర్పరిమ్రుచ్చు నెఱుంగుదే ని
య్యనువరిరూపుఁ గైవడియు నన్వయముం జరితంబుఁ జెప్పుమా
విని ప్రియుఁ దార్చెదన్ మనము వేడుకఁ దీర్చెదఁ గాము నోర్చెదన్.

103


వ.

అనుటయు నక్కన్యకారత్నం బి ట్లనియె.

104


క.

కలలోనఁ గన్నరూపముఁ
గలలోనన కౌఁగిలింపఁ గంటిఁ బిదప నో
లలనా! నీ పలుకుల నో
లల నాడితిఁ గాని పతిఁ దలంప నెఱుంగన్.

105


క.

ఏదంపతులకుఁ బొడమెనొ
యేదేశమునందుఁ గీర్తి కెక్కినవాఁడో
యే దెసవాడొ యెఱుంగను
మేదిని నిత్తెఱఁగు కూరిమియుఁ గలదె చెలీ!

106


వ.

అనుటయుఁ జిత్రరేఖ విచారించి.

107


గీ.

[1]ఆలజాలంబు నీరిలో నాడుజాడ
గాలిపడగ యాకసమునఁ గ్రాలు త్రోవ
నిదురలొపలఁ గల దోఁచునీడ [2]విధము
గానవచ్చునె యప్పుడ కన్నఁ గాక.

108


వ.

అనుటయు.

109
  1. అఖిలజాలంబు నీరిపై
  2. పిదప