పుట:ఉత్తరహరివంశము.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

149


స్వయంవరసమయంబున సకుంకుమాక్షతవ్రాతపాత్రహస్తలై [1]సువ్రతంబు చెప్ప
వచ్చిన సతులం దలఁపింపఁ బ్రహారమూర్ఛాపరశులగు వీరుల బొండుగలు వ్రచ్చి
పెఱికి తిగిచినం బ్రేగులు రాకున్న ముక్కుల నూఁదిపట్టి వెనుకకు నిక్కి ఱెక్కలు
విద్రుచు కంకగృధ్రంబులచేతం జలిగాలి వొడమినం దెలిసి సచేతనంబు లగుకళే
బరంబులునుం గలిగి మఱియు నొండొరుల మెచ్చక నీసున వ్రేసిన యసిధారలు
మండ గండు మిగిలి మెదడును బ్రుంగి మజ్జంబులు దలమునుకలుగ సందడిం
దడఁబడ కుండ ముందల పట్లు పట్టికొని పోట్లాడువారును మొనకయిదుపుల పయిఁ
రఱియ నుఱికి సరకు సేయక వీపునం జెంగలువరేకులు వెడలినట్లు వెడలఁ
గెడయువారును వీరు వారనక వీరావేశంబునం చేతుల కసివోవం జెలరేఁగి సింహ
నాదంబులు సేయుచు మోదువారునుం దిరుగుడు వడక తివియక బీరంబు సెడక
బీఱువోక యొడ్డగిల్ల యొదుఁగక వేసఱక విఱుగక విబుధలోకంబునకు వెక్క
సంబును వేడుకయునుం గదుర నసమసమరంబు సేయ మధ్యాహ్నసమయం బయ్యె
నయ్యవసరంబున.

229


తే.

దనుజవైరి విచక్రుతోఁ దలపడుటయు
హలధరుఁడు హంసుఁ దాఁకె సాత్యకి యెదిర్చి
డిభకు మార్కొని రల్ల హిడింబు నుగ్ర
సేన వసుదేవ నృపతు లుత్సేక మెసఁగ.

230


మ.

మఱియుం దక్కినవారుఁ దక్కినరిపుల్ మార్కొన్నచో శౌరి డ
గ్గఱి బాణంబులు మూఁడు డెబ్బదులు పై గప్ప న్విచక్రుండు న
త్తఱి నేసెం దెగ నిండ నారసమునన్ దైత్యారి వక్షంబునం
గఱి దోఁపన్ హరియున్ భుగు ల్భుగులుగాఁ గ్రక్కె న్వెసన్ నెత్తురుల్.

231


క.

పదునాలుగుజగములుఁ దన
యుదరంబునఁ దాల్మి విష్ణుఁ [2]డుత్పాదకుఁడై
తుది నుమియునాఁటిచందము
మదిఁ దలఁచె మహేంద్రుఁ డపుడు మాధవుని దెసన్.

232
  1. చపుతంబు
  2. డుత్పాతకుఁడై