పుట:ఉత్తరహరివంశము.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

ఉత్తరహరివంశము


ధీరతఁ జేయు మియ్యెడను దిగ్విజయం బొనరించి యజ్ఞసం
భారము లెల్లఁ దెత్తుమని బాహుబలంబుఁ జలంబుఁ జెప్పినన్.

118


క.

అతఁ డౌణ గా కనుటయు స
న్నుతమతి యగు నాజనార్దనుండు ధరిత్రీ
పతిసుతులకు నతిహితముగ
జతురతతోఁ బలికె సహజసౌజన్యమునన్.

119


గీ.

రాజసూయంబు చేయ నేరాజు దలంచు
నాతనికి రాజు లరిగాపు లయినఁ గాని
నిర్వహింపదు మన మెల్లి నేఁడు సేయు
లావు మెఱయునె ధర యింగలాలపుట్ట.

120


వ.

అది యెట్లనిన.

121


చ.

ఇరువదియొక్కమాఱు ధరణీశ్వరులం బరిమార్చి పేర్చి దు
ర్ధరతరసారుఁ డైనజమదగ్నితనూజుఁడు సంగరంబులో
సరిసరిఁ బోరియుం బిదపఁ జాలక యెవ్వని కోహటించె నా
పరబలభీష్ము భీష్ముఁ బెఱపార్థివు లేమనువారు పోరులన్.

122


మ.

కురువీరాగ్రణి బాహ్లికుం డలిగినం గోదండపాండిత్య మె
వ్వరుఁ జూపంగ వలంతు లే పవనజున్ వైరిక్షమాపాలభీ
కరు భీముం గదలించువారుఁ గలరే కంసారితోఁ బోరిలో
సరివాఁడై యని మీకుఁ బెట్టుట జరాసంధుండు సైరించునే.

123


సీ.

నరకాసురప్రాణనాళోత్తరణకేళి
                 [1]రణకేళి వలకేళి రమణఁ జూపెఁ
గంసదానవశిరఃకమల[2]కృత్తన మేలు
                 తనమేలు చేయి పుధ్దలకు నొసఁగెఁ
జాణూరముష్టికక్షతజకీలాలంబు
                 నాలంబులో నెల్ల నలవు వఱపె
మురహయగ్రీవాంత్రమూలఫేనావళి
                 నావ[3]లిదలఁగ జీకాకు పఱచె

  1. వల కేలివనమున కలవు సూపెఁ
  2. కృకతనమగు
  3. లీవలఁగఁ