పుట:ఉత్తరహరివంశము.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

ఉత్తరహరివంశము


క.

మా కేది దిక్కుఁ దెరువో
లోకంబులు మూఁడు నింతలో నే మగునో
నీకడు పట సర్వంబును
జేకొనవే దుష్టశిక్ష చేసి మురారీ!

104


చ.

అనిన యతిం గనుగొని మురాంతకుఁ డిట్లనుఁ దప్పుచేసితిం
గినియకుమయ్య మి మ్మొకఁడు కీఁడునఁ బెట్టెడువాఁడు లేఁడ యెం
దని పరికింపనైతి విను మాధరణీశకుమారధూర్తులం
దునియెద నింతలో వగలఁ దూలకు సాత్యకితోడు సంయమీ.

105


క.

ఎఱిఁగి యెఱిఁగి నీముందు
నఱగొడ్డెము చేసి పోయి [1]రది గైకొన రీ
తెఱఁ గయినహంసడిభకులు
కొఱవిం దల [2]బరికికొన్న కొఱడులు గారే.

106


క.

హరుఁడు వర మిచ్చె వాణీ
వరవరుణకుబేరసురవివైవస్వతు లి
త్తురు గాక నీవు గినిసిన
వరముల గిరములను బ్రదుకువారే కుమతుల్.

107


క.

కలడు జరాసంధుఁడు వా
రలకుం జెలికాఁడు నిష్ఠురభుజాపరిఘుం
డలఘుబలుఁడు సేనలతో
గలయకమును వారిఁ జంపఁగలవాఁడఁ జుమీ.

108


చ.

ఎద్రిచిన కాలపాకముల నీగతి నీమదిఁ గ్రోధవల్లికం
బద్రిచినవారు మన్నిశితబాణపరంపర వైవ మిణ్గుఱుల్
విద్రుపగఁదత్ఫలంబులచవిం జరితార్థులుగా శరీరపుం
జిద్రుపలు చేరుఁ దత్సతులచేతులఁ గాకకులంబువాతులన్.

109


చ.

అనిన మునీంద్రుఁ డెంతయుఁ బ్రియంబున నచ్యుత పుండరీకలో
చన కమాలాసనాదిసురసంఘశరణ్యపదాంబుజా జనా

  1. రదె కొసరై యీ
  2. కఱటికొనినకోర్కులు కావే.