పుట:ఉత్తరహరివంశము.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

117


వెడవీక యొడలు చేసెదు
కడపల జపమునకు నేఁడు గలదో లేదో.

44


వ.

అని పలికి యతఁడు పలుకకుండం దమలోన.

45


చ.

తిరిసినకూడు దెచ్చి నలుదిక్కుల బోడలు తిండిపెట్టగాఁ
బెరిగినపొట్టతోడ నొకపీఁటపయిం దొర వోలె నెవ్వరిన్
సరకు గొనండు పట్టుకొని చాఁగఱ గొన్న బలే యెఱుంగుఁ డ
క్కరి బలుమోపు మోచు నయగారితనం బిరువుట్టి గట్టినన్.

46


తే.

బాంధవులఁ బాసి తమయిల్లుపట్టు విడిచి
తల్లిదండ్రులు వగవఁ గైతవముతోడ
బోడతలలు గాఁ [1]బడసిరి పొడువలెల్ల
వీనిమాటలచేఁ గదా వెఱ్ఱులైరి.

47


చ.

ఎఱుఁగరు గాక లోకమున నెవ్వరికైనను మేలు సేయఁగా
నొఱపగునాశ్రమంబున సమున్నత మైన గృహస్థధర్మముం
[2]బఱగడ వైచి గోఁచిగొని పాఱెడుపొల్లకు ముక్తి గల్గునే
పఱిగల నేఱినం గొలుచుఁ [3]పాఁతటికిం గలదే తలంపగన్.

48


వ.

అని పలుకుచు నయ్యరువురు న మ్మహాముని కిట్లనిరి.

49


సీ.

[4]అఱుకువయెఱుకతో నాశ్రమం బిది మెచ్చి
                 [5]తిదిగాక గృహమేధ మేల యెల్ల
వేపదంబునఁ బొందె దిందు మూఢుండవ
                 కాక సంసారసౌఖ్యంబు మాని
కఱపె ది ట్లున్న కొందఱకు నారకపాత
                 శీలంబుఁ దగునె తాఁ జెడ్డవాఁడు
వెనకయ్యచేతికి వెస లిచ్చె ననుమాట
                 నిజముగా నిచ్చోట నిన్ను వంప


తే.

నొరులు లే రని తలఁతేని నున్నవార
మేము గృహిని గాఁ బంచయజ్ఞేచ్ఛఁ గలిగి

  1. బది
  2. పఱకటవైది
  3. పాఁతఱకుం (వీ)
  4. అలకువ
  5. తేదిగా