పుట:ఉత్తరహరివంశము.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

ఉత్తరహరివంశము


క.

[1]అయ్యాదవగోపాలుం
డెయ్యెడ నున్నాఁడొ పనుల నెం దడఁచెనొకో
యయ్యన్న తమ్ముఁడవు నీ
వియ్యాడెడుబిరుదుమాట లెచటఁ జదివితో.

46


చ.

మిడికెడు వాసుదేవుఁ డన మీఁదు దలంపక యాదవుం డొకం
[2]డుడుగఁడు వానిఁ ద్రుంతు సమరోర్వరలో నని వచ్చి పోరునే
పడుచులతోడఁ బౌండ్రుఁ డది పంతమె నావిశిఖంబు మ్రింగు నీ
తొడిగినబాణము న్వెనుక తూణమునందుననున్న ప్రాణమున్.

47


గీ.

చక్రి పొడమంగఁ బార్థివస్థాన మయ్యె
నోరి మీ వంశమందుఁ దాఁకోర్వఁ జాలు
వారిఁ జూపుము కుమ్మరావమున రాగి
ముంత లేఱుంగఁ గలవె నీ కింతయేల.

48


వ.

అనుటయు సాత్యకి కోపించి.

49


క.

ప్రేలకు జీలుగు వెరిఁగిన
మాలెకుఁ గంబంబు గాదు మాటలు మిగులన్
[3]నాలుక గఱచినయంతనే
దాలునొ మగతనము జూప సాత్యకి యెదురన్.

50


క.

గిరితోడ [4]నురభ్రకమును
హరితో [5]భషకంబుఁ జెనయునట్టిద కాదే
హరితోడ నీవు లావునఁ
బురణించుట పౌండ్ర! నీకు బోఁ టేమిటికిన్.

51


ఉ.

పన్నిదవాఁడ వింకఁ జెడి పాఱకుమీ యని మూదలించి చే
నున్న నిశాతబాణము మహోద్ధతిమై నరిబోసి యేసినన్
గన్నుల నోర నెత్తు రొలుకంగ శతాంగముమీఁద వ్రాలె నా
సన్నపరేతరాజ ఘనసౌధతలంబునఁ బవ్వళించె నాన్.

52
  1. అయ.... డేయెడ...యీయిన్న....వీయడి బీరలపు
  2. దుడుగక వానిముంతు లవణోదములో నని
  3. నాలుగు
  4. న కరిపోదము
  5. ఋక్షంబు