పుట:ఉత్తరహరివంశము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

65


బొడమి వ్రేఱేనిముందటఁ బొడవు సూపెఁ
[1]బొడువులం దెల్లఁ బొడువైనబోటువేల్పు.

171

(అచ్చతెలుఁగు)

ఉ.

ఏనికతోలుపచ్చడము, నెమ్ములగుబ్బసరంబు, సంపపూఁ
దేనియతియ్యవిల్లుఁ గొని త్రెంచినబొట్టు పలుంగునెట్టము
న్వీనుల[2]చూపుపెండెముఁ, దవిల్చిన మంచముకోటికైదువుం
బూనిన ప్రాఁతవేల్పుఁ గని, పోకులఁబోయిన వెన్నుఁ డిట్లనున్.

172


సీ.

కల్హారమకరందకలితమందాకినీ
                 లహరీపరీతకోలాహలంబు
బాలేందుచంద్రికాపరభాగశోభాప
                 రాగసంభావితారగ్వధంబు
సేవాసమాసన్నసిద్ధసీమంతినీ
                 తాలవృంతోత్తాలతాండవంబు
కాత్యాయనీదత్తకర్ణావతంసక
                 ర్పూరఖండామోదపూరితంబు


తే.

మారుతంబు నామీఁదట మలసియాడ
గలుగునొకొ నాకు నొకనాఁడు కన్నులార
శివునిఁ జూచుపుణ్యం బనుచింత నెఱయ
మొదలివేలుపుఁ బొడగంటి మ్రొక్కఁ గంటి.

173


సీ.

తరుణపల్లవరాగతామ్రవిద్యుల్లతా
                 భాసురం బగుజటాభార మెఱిఁగి
నిబిడసంతమసాతినీలబాలతమాల
                 పరిపంథి యగుకంఠభాగ మెఱిఁగి
తారముక్తాహారధవళశారదనీర
                 దాకార మగునిర్మలాంగ మెఱిఁగి
ద్రవశాతకుంభగౌరకుసుంభకుసుమఖం
                 డనశీల మగుఫాలనయన మెఱిఁగి

  1. బొడవు (బొడువ) లందెల్లఁ బొడవైన బోఁటు
  2. చూపుఁబెం