పుట:ఉత్తరహరివంశము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

45


తే.

అక్షరత్రయరూపమై యఖిలయోగ
మూల మగుప్రణవంబు నా మూర్తి సుమ్ము
నీకుఁ జెప్పితి, నత్యంతనియతమతికిఁ
దప్ప నీ మంత్ర మొరులకుఁ దగదు తెలుప.

59


చ.

అని పరమోపదేశముగ నానతి యిచ్చిన యంతనుండియు
న్వనజదళాక్షు భక్తజనవత్సలు [1]వేదశిఖావతంసపా
వనపదపల్లవుం ద్రిదశవల్లభసేవితు నాశ్రయింతు నా
మనమున ఘోరదుర్దశలు మట్టిన సంపద మిన్ను ముట్టినన్.

60


క.

అన విని ధర్మతనూజుఁడు
జనపతులును గృష్ణుఁ జిత్తసరసిరుహములం
దునిచి పులకాంకురమ్ములు
మొనయఁగ నానందబాష్పములు వెడలంగన్.

61


క.

అని చెప్పిన వైశంపా
యనునకు జనమేజయుఁడు ప్రియం బారఁగ ని
ట్లను మురవైరి పరాక్రమ
మనఘా వినవలతుఁ జెప్పుమా పరిపాటిన్.

62


వ.

అనుటయు వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

63


సీ.

మడియించె వక్రాఖ్యు మాహిష్మతీనాథు
                 నరకాసురునిఁ జంపె నాకవిభుని
దట్టించి పారిజాతము దెచ్చె లోహిత
                 హ్రదమున వరుణు [2]నూటార్చె నూఱు
చెట్టలు సైరించి శిశుపాలు నరకె శో
                 ణితపురంబున నగ్ని నీలలోహి
తుని గెల్చె బాణునిఁ దోలె వార్ధిఁ గలంచి
                 పాంచజన్యంబు చేపట్టి రూప

  1. దేవ
  2. నో