పుట:ఈశానసంహిత.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గము లీగ్రంథమునఁ గలవు. వర్ణనములు పదములును కేవల పేలవములుగా నున్నవి. "సతు కామకళాశాస్త్రం సర్వ మభ్యస్య రాగవాన్" అధ్యా. 71. శ్లో. 17. కామకళాశాస్త్రమను పద మెట్టిప్రాచీనమో తెలిసికొన్న నీకవిప్రాచీనతయుఁ దెలియఁగలను. ఈభక్తకవి యీగ్రంథము రచించునాఁటికే శివరాత్రిమాహాత్మ్యము శిథిలమైయుండును. అందలి పాఠములు లోపములు నాతనికి సవరించుకొన నలవికానివి. ఆకారణమున వానినెల్ల నట్లే విడచినాఁడు. పైపెచ్చుగ అత్ర = ఈస్థలమున అనఁగా శివరాత్రిమాహాత్మ్యగ్రంథమున సని యభిప్రాయము. గ్రంథపాతః = గ్రంథము లోపించినది; అని కంఠోక్తిగఁ జెప్పివైచినాఁడు. అకారణమున నీయీశానసంహిత మిక్కిలి అర్వాచీనమనియే తలంచవచ్చును. ఆంధ్రభాషలోని గ్రంథములు సంస్కృతీకరింపఁబడుట యొకవింతకాదు. వసుచరిత్ర మొకానొకపండితునిచే సంస్కృతీకరింపఁబడినదని విన్నాము. భాస్కరపంతులను నప్రౌఢాంధ్రకవిచే తెలుఁగునఁ దొలుత రచింపఁబడిన కన్యకాపురాణము సంస్కృతీకరించబడి ముద్రింపఁబడియున్నది. శ్రీశైల శైవమఠాధిపులలోఁజేరిన శ్రీశ్రీ కఱ్ఱి బసవశాస్త్రి గారను మహాపండితులు పాల్కురికి సోమనాథరచితమగు బసవపురాణము మొదలగు గ్రంథములను సంస్కృతీకరించి ప్రకటించుచున్నారు. కావున నీసంహితయు నట్టివానిలోఁ జేరిన యొకటి యగును.

తాను విశేష ప్రతిభావంతుఁడు కాకున్నను గ్రంథము పాతభూయిష్ఠమైయున్నను దానిని దాను సంస్కృతీకరింపఁబూనుటకుఁ గారణమేమా? యనుప్రశ్నము రాకపోదు. శ్రీనాథుఁడు శివరాత్రిమాహాత్మ్యము రచించుటలో నేయభిప్రాయము మనమున నుంచికొనియెనో దానినే సంహితాకారుఁడుగూడ మది నెంచియుండును. పెక్కు తావులందు శివపూజామాహాత్మ్యములను వర్ణించిన శ్రీనాథునకు నాయాగ్రంథములందు శివరాత్రిమాహాత్మ్యముఁ దెలుపుటకుఁ దగినమహాపాతకము లుదాహరణ