పుట:ఈశానసంహిత.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానిని హేమాంగదుఁడను శబరరాజు పాలించుచుండెను. అతనికి యజ్ఞదత్తుఁడను మంత్రి కలఁడు. మంత్రిభార్య సుశీలాభిధాన. ఆదంపతులకుఁ బెక్కువ్రతము లాచరింప సుకుమారుఁ డుదయించెను. అపట్టణముచుట్టును ఇరావతీశతద్రువిపాట్సింధునదీమాతృకంబులగు జనపదంబులు గలవు. ఆపట్టణపరిసరమున నర్మదాతీరకాంతారభూమిని మఱ్ఱియను పేరి కల్పద్రుమంబునీడ నోంకారనాథుఁడు శంభుఁడు పాయకయుండును. అని పేర్కొనబడినది.

సుకుమారుని విద్యాభ్యాసము రెంటను సమానము. యౌవనమదోద్ధతుఁడై కులస్త్రీలఁ జెఱుచుటయు రాజనిష్కాషితుఁడై దేశాంతర మేగుటయు రెంటను సమమే. తొలుత కీకటదేశంబునకు దరువాత హూణమండలమునకుం జనినట్లు మాహాత్మ్యమునను, తొలుత నేదో యొకదేశంబునకును దరువాత హూణమండలమునకును జనినట్లు సంహితయందును గలదు. హూణమండలమునఁ జండాలీసమాగమము సంహితయందును కీకటదేశము విడిచి హూణభూమి కేఁగుత్రోవలో చండాలీసమావేశనము మాహాత్మ్యమునందును వర్ణింపఁబడినది.

చండాలీసమాగమమాదిగ నాతఁ డామాలెతం గూడి నానావిధమాంసము లాహరించుచు బాటసారులగు విప్రుల సంహరించి, వారిధనంబు లపహరించి నానావిధదుష్కార్యము లాచరించినట్లు సంహితను, ప్రథమసమావేశనానంతరము జనంగమప్రమదానిర్దిష్టమగు భద్రకాళీనికేతనమున కరిగి యట బ్రాహ్మణులతో వసించుచు నానావిధవిద్యలచే వారిని మెప్పించుచు వంచన బయల్పడనీకుండ మాలెత మాలబాలకునిచేఁ బంపిన విందు లారగించుచు దినదినము రేపైన మాపైనఁ దనవారి నెట్లో కనుబ్రామివచ్చిన మాలెతతో నిధువనంబు సాగించుచు బ్రాహ్మణుల కెఱుకపడనీయకయే పక్కణశబరులం గూడి మృగయావినోదంబు సాగించుచు నొంటిపాటున వచ్పు విప్రుల మొత్తి వారిద్రవ్యం