పుట:ఆహార కల్తీ నివారణ చట్టము, 1954.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

(2) ఉపపరిచ్ఛేదము (1) యొక్క ఖండము (సీ) లోని ఉపఖండము (i) క్రింద పబ్లికు విశ్లేషకునకు పంపబడిన మచ్చుయొక్క భాగము పోయినచో, లేక చెడిపోయినచో, పబ్లికు విశ్లేషకుడుగాని, ఆహార ఇన్ స్పెక్టరుగాని స్థానిక (ఆరోగ్య) ప్రాధికారిని కోరిన మీదట, అతడు సదరు ఖండము (సీ) యొక్క ఉపఖండము (ii) క్రింద తనకు పంపబడిన మచ్చు యొక్క భాగములలో ఒక దానిని విశ్లేషణము కొరకు పబ్లికు విశ్లేషకునకు పంపవలెను.

(3) 10వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (1), లేక ఉపపరిచ్ఛేదము (2) క్రింద ఏదేని ఆహార పదార్ధము యొక్క, లేక కల్తీకి ఉపయోగపడు దాని యొక్క మచ్చును తీసికొనినప్పుడు, ఆహార ఇన్ స్పెక్టరు ఆ వెనువెంటనే వచ్చు పనిదినమున సందర్భానుసారముగ ఆహార పదార్ధము యొక్క మచ్చును గాని కల్తీకి ఉపయోగపడు దాని, యొక్క, మచ్చును గాని ఆ రెంటి మచ్చులను గాని మచ్చుల విషయములో విహితపరచబడిన నియమముల ననుసరించి సంబంధిత స్థానిక ప్రాంతపు పబ్లికు విశ్లేషకునకు పంపవలెను.

(4) 10వ పరచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (4-ఏ) క్రింద నాశనమొనర్చబడిననే తప్ప ఆ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (4) కింద అభిగ్రహించబడిన ఆహార పదార్ధమును. మరియు ఆ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (6) క్రింద అభిగ్రహించబడినట్టి కల్తీకి ఉపయోగపడు దానిని దేనినై నను వీలైనంత త్వరగా మరియు ఎట్టి సందర్భములోను పబ్లికు విశ్లేషకుని రిపోర్టు అందిన తరువాత ఏడు దినములకు మించి ఆలస్యము కాకుండ, మేజీస్ట్రేటు సమక్షమున పెట్టవలెను:

అయితే, ఏదేని ఆహార పదార్ధము ఎవరినుండి అభిగ్రహించబడినదో ఆ వ్యక్తి, ఈ విషయమున మేజిస్ట్రేటుకు దరఖాస్తు పెట్టినచో, మేజిస్ట్రేటు వ్రాత మూలకమైన ఉత్తరువు ద్వారా ఆ ఉత్తరువులో నిర్ధిష్టపరచబడిన గడువు లోపల అట్టి పదార్ధమును తన సమక్షమున పెట్టవలెనని ఆహార ఇన్ స్పెక్టరును ఆదేశించవలెను.

(5) మేజిస్ట్రేటు ఆవశ్యకమని తాను భావించునట్టి సాక్ష్యమును తీసికొనిన మీదట-

(ఏ) ఉపపరిచ్ఛేదము (4) క్రింద తన సమక్షమున పెట్టబడిన ఆహార పదార్ధము కల్తీ చేయబడినదై నట్లు, లేక తప్పుడు బ్రాండు వేయబడినదై నట్లు, అతనికి తోచినచో, అతడు, ఆ ఆహార పదార్ధము-

(i) సమపహరణము చేయబడి సందర్భానుసారముగ కేంద్ర ప్రభుత్వమునకు గాని, రాజ్య ప్రభుత్వమునకు గాని స్థానిక ప్రాధికార సంస్థకు గాని, చెందవలెననని; లేక

(ii) మనుష్య ఆహారముగ దానిని ఉపయోగించుటను నివారించునట్లు సొంతదారు యొక్క లేక దానిని ఎవరినుండి అభిగ్రహించినారో ఆ వ్యక్తి యొక్క ఖర్చుపై నాశనమొనర్చబడవలెనని; లేక

(iii) మోసపు పేరుతో దానిని మరల విక్రయమునకు పెట్టుటను, లేక ఆహారముగ ఉపయోగించుటను నివారించునట్లు వ్యయనము చేయబడవలెనని; లేక

(iv) సొంతదారు జామీను దార్లతో గాని, జామీనుదార్లు లేకుండ గాని బాండును నిష్పాదించిన మీదట, దాని సరియైన పేరుతో విక్రయించుటకు, లేక ఆ ఆహార పదార్ధమును తిరిగి ప్రాసెస్ చేసిన తరువాత మనుష్యులు సేవించుటకు విహితపరచబడిన ప్రమాణముల కనుగుణమైన దానిగ చేయగలుగ వచ్చునని మెజిస్ట్రేటు అభిప్రాయపడిన యెడల, ఉత్తరువులో నిర్ధిష్ట పరచబడినట్టి, అధికారి యొక్క పర్యవేక్షణ క్రింద తిరిగి ప్రాసెస్ చేసిన తరువాత విక్రయించుకొనుటకై. అతనికి వాపసు చేయబడవలెనని ---