పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

మకారమునకు మకారమున్ను, రేఫకు రేఫయున్ను, వకారమునకు వకారమున్ను, లకారమునకు లకారళకారమున్ను ఱాకు ఱాయున్ను యతిగా నుండునట్లు చెప్పిన నెక్కటియతి యగును.


వ.

వీనికి బ్రయోగములు సముద్రతరంగములవలెఁ బ్రబంధాదులయందు గలవు గనుక
ఇట వ్రాయలేదు.

291

ఋయతి

అనంతచ్ఛందంబున (1-87)
గీ.

క్షితి ఋకారరూపస్వరయతులు పరఁగు, ఋగ్యజుస్సామవినుతుండు కృష్ణుఁడనఁగ
వృష్ణికులజుండు కరుణాసమృద్ధుఁ డనఁగ, [1]హేమచేలుండు దేవతాఋషభుఁ డనఁగ.


తా.

స్వరములలోని ఋకారమునకు హల్లులతోఁ గూడినఋకార మగువట్రువసుడికిని, ఇకారరూప మైనక్రారవడికిని, రేఫ చెప్పితే అది ఋయతి యగును.

లక్ష్యము
క.

క్షితి ధనదుమించుకలిమియు, ఋతురాజును మించురూపరేఖావిభవో
న్నతి రంగపతికిఁ జెల్లును, గృతిశతముల కతఁడె కర్త శ్రీకరుఁ డగుటన్.

293
అథర్వణభారతమున
శా.

తృష్ణాతంతునిబద్ధబుద్ధు లగురాధేయాదులున్ గూడి శ్రీ
కృష్ణుం గేవలమర్త్యుగాఁ దలంచి మర్ధింపంగ నుత్సాహవ
ర్ధిష్ణుం డయ్యె సుయోధనుం డకట! ధాత్రీనాథ! యూహింపుమా
యుష్ణీషంబునఁ గట్టవచ్చునె మదవ్యూఢోగ్రశుండాలమున్.

294
వరాహపురాణమున
క.

కావున మీరు రచించిన శ్రీవారాహంబు మంచికృతి నాపేరన్
గావింపుఁ డనుచు సుముఖుఁ, డై వీడెముఁ గప్పురంబు నర్పించుటయున్.

295
మనుచరిత్రము
సీ.

ప్రతిఘటించుచిగుళ్లపై నెఱ్ఱవారిన, రీతి నున్నవి వీనిమృదుపదములు...

296


వ.

అని యిట్లు బహుప్రబంధములయందుఁ జెప్పఁబడి యున్నది గానఁ దెలియునది.

297

ప్రాకృతాదేశయతి

నన్నయభట్టు లక్షణసారంబున
గీ.

తొలుతఁ బ్రాకృతసూత్రంబువలన జ్ఞాకు నార్ణ మాదేశముగ వచ్చి యమరుకతనఁ
బ్రాకృతాదేశసరసవిరామ మై త, నర్చుఁ గృతుల శుకుండు సుజ్ఞాని యనఁగ.

298
  1. హేమపీతాంబరుఁడు దేవవృషభుఁ డనఁగ