మఱియు, శ్రీనాథుని సునందనచరిత్రమున —
సీ. |
శాశ్వతవిశ్వవిశ్వంభరాచక్ర మీ, రాజకుమారుఁ డేలంగఁ గలఁడు
| 274
|
ధూర్జటివారి కాళహస్తీశ్వరశతకమున —
శా. |
నీకుం గాక కవిత్వ మెవ్వరికి నే నీనంచు మీఁదెత్తితిన్
జేకొంటిన్ బిరుదంబుఁ గంకణము ముంజేఁ గట్టితిన్ బట్టితిన్
లోకు ల్మెచ్చ వ్రతంబు నాతలఁపు తీరున్ భీరునింగాదు ఛీ
ఛీ కాలంబున రీతితప్పుడు సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
| 275
|
అల్లసాని పెద్దన —
ఉ. |
ఏపునఁ గృష్ణరాయజగతీశ్వరుఖడ్గము మింటిమార్గమున్
జూపిన భానుమండలముఁ జొచ్చి హుటాహుటి శత్రు లేగుచో
రేపటిబాపనయ్య పగలింటిమహోగ్రపుజంగమయ్య యో
మాపటిదాసరయ్య మము మన్నన సేయు మటందు రెంతయున్.
| 276
|
భారతము, ద్రోణపర్వమున —
క. |
అభిముఖసరివృత్తము లగు, నిభతురగస్యందనంబు లిలఁ గూలఁగ సం
క్షుభితుం డగు వృషసేనుఁడు, రభసంబున నతని శరములను గడు నొంచెన్.
| 277
|
నన్నయభట్టు ఇంద్రవిజయమున —
చ. |
ఒకపలువాతఁ గొన్నకిటియుం దలలో నిడుకూర్మభర్త నా
లిక లిరు గన్న సీదిరపుఱేఁడు పయోధరధారఁ బొట్టఁబెం
చుకులనగాళి యీడు ప్రతి జో డెన యెంచనఁ గూడ దేరి కె
న్నికగ యయాతియొండె ధరణిన్ భరియించి చెలంగు వానికిన్.
| 278
|
భాస్కరరామాయణమున —
క. |
దానవసుందరు లత్తఱి, జానకి నందలముమీఁద సమ్మద మొదవం
గా నునిచి శారదాభ్రవి, లీనత నేసారుచంద్రరేఖయుఁ బోలెన్.
| 279
|
రాఘవపాండవీయమున —
రగడ. |
లలిత మగులవలీకుడుంగముల లుంగమాల...
| 280
|
భాస్కరరామాయణమున —
ఉ. |
గొబ్బున నానతిమ్ము రఘుకుంజర! నీకరుణాసముద్ధతిన్
డెబ్బదిరెండువెల్లువల దేవరలక్ష్మణు లంకఁ జేర్తునో
గబ్బిగ రావణాసురుని గర్వమడంచి...
| 281
|