పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21. తెలుగుదేశం పార్టీలో చీలిక

డిశంబర్ 1994లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ (I) పార్టీని చిత్తుగా ఓడించి అసెంబ్లీలో గల 294 స్థానాలలో 214 స్థానాలను కైవసం చేసుకొంది.12 డిశంబరు 1994న రామరావు నాల్గవసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. కాని తొమ్మిది నెలలు తిరగక ముందే రామారావు ఎవరూ ఊహించని విధంగా 31 ఆగష్టు 1995న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యవలసి వచ్చింది.

అంతఃపుర రాజకీయాలు

రామారావు రాజీనామాకు మూల కారణం అతని కుటుంబసభ్యుల మధ్య అంటే కొడుకులు, అల్లుళ్ళు ఒకవైపు రెండవ భార్య లక్ష్మీపార్వతి మరొకవైపు అధికారం కోసం జరిపిన కొట్లాట.

రామారావు మొదటి భార్య బసవరామతారకం 1984లో మరణించారు. ఇది జరిగిన అయిదు సంవత్సరాల తరువాత ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోయారు. ఎందుకంటే నవంబరు 1989న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర అపజయం పొందింది. కాంగ్రెస్ పార్టీ 294 స్థానాలలో 180 స్థానాలు గెలిచి అధికారంలోకి తిరిగి వచ్చింది. రాజకీయంగా ఒంటరి అయిన రామారావు కోట్లాది రూపాయలు విలువచేసే ఆస్థిని తన సంతానానికి పంచి వారికి దూరమయ్యారు రాజకీయంగా, మానసికంగా ఒంటరితనం అనుభవిస్తున్న తరుణంలో రామారావు జీవితంలో సంస్కృత, తెలుగుభాషలలో ప్రావీణ్యం సంపాదించిన లక్ష్మీపార్వతి అనే ఒక విడాకులు పొందిన మహిళ అతని జీవితంలో ప్రవేశించింది. ఆమె రామారావు జీవిత చరిత్ర వ్రాయడానికి అతనితో పరిచయం చేసుకొంది. వారి పరిచయం అనురాగంగా మారింది. రామరావు పక్షవాతంవల్ల ఆరోగ్యం పోగొట్టుకున్న