పుట:ఆంధ్రవిజ్ఞానసర్వస్వము ప్రథమ సంపుటము కొమర్రాజు వెంకటలక్ష్మణరావు 1932.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ప్రస్తావన శ్లో, సహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే, తత్స్వయం యోగసం సిద్ధః కాలే నాత్మని విన్దతి. శ్లో. శ్రద్ధావాజ్ లభ తే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరే ణాధిగచ్ఛతి. శ్లో, బహూనాం జన్మ నా మంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః. ఆఖండమైన ఆత్మో పలబ్ధి అనంతమైన విశ్వమునకు పరమార్థము. చరాచరఖండస్వరూపమైన విశ్వమంత యును పరమార్థమైన ఆత్మోపలబ్ధి కనవరతము యోగా భ్యాసమును జేయుచున్నది. విశ్వమంతయును వ్యక్తా వ్యక్తరూపమున యోగసంసిద్ధికి ప్రస్థానమును జేయు చున్నది. ఆత్మయోగ తత్త్వార్థమునందు అవ్యక్తమైన చిదంబరమును, వ్యక్తమైన దిగంబరమును ఐక్యమును బొందుచున్నవి. పిపీలికాది బ్రహ్మపర్యంతము గల జీవజాల ముల యాత్మోపలబ్ధి కణువు మొదలు మహత్తు వఱకును వ్యాప్తమైన ప్రకృతియంతయు సాధనభూతముగ నున్నది. విశ్వసాహిత్య మంతయును నీ పరమ ప్ర విజ్ఞానరూపమున సమకూర్చుచున్నది. శా యోజనమును గీత., 8-30. గీత., 5-38. గీత., ౭-౧౭. న్నది. జీవము బ్రహ్మత్వప్రాప్తి కనవరతము చేయుచున్న ప్రస్థానము సకలకర్మములకును, మంత్రములకును, తంత్ర ములకును, కళలకును, శాస్త్రములకును, దర్శనముల కును, ధర్మములకును, వేదములకును, విజ్ఞానములకును, మతములకును, పురాణములకును, కావ్యములకును, పరి శోధనలకును పరమార్థము. సృష్ట్యాదినుండియును హిందువుల గణనమునందు ౧,౯జి,౮,రాగి,౦ 33 సౌరమానాబ్దములు గతించినవి. పాశ్చాత్త్యశాస్త్రజ్ఞుల గణనమును నీగణనమున కనురూప ముగ నున్నది. మహాకాలగర్భమునం దంతర్గర్భితము లైన కల్పములు, మన్వంతరములు, యుగములు, జీవ ప్రస్థానమునకు వినియోగపడుచున్న విధమును విశ్వ విజ్ఞానము విశదము చేయుచున్నది. ఆది కాలముననుండియు భరత ఖండము సత్యాన్వేషణమునందును, విజ్ఞానోపార్జన సంరక్షణములందును ప్రపం చేతిహాసములందు గణనీయ ముగ నున్నది. వేదములు, వేదాంగములు, పురాణములు, ధర్మశాస్త్రములు, కళలు నీయర్థమును విశదము చేయు యోగారూఢులైన వీరులు, ధీరులు, కవులు, గాయకులు, శాస్త్రజ్ఞులు, శిల్పులు, కళాభిజ్ఞులు, సిద్ధులు, ధర్మాత్ములు, తత్త్వజ్ఞులు, రాజులు, యోధులు, కార్మి కులు, త్యాగులు, సన్న్యాసులు, యంత్ర నిర్మాతలు విజ్ఞాన వికాససాధనమున మానవధర్మాభ్యుదయమునకు పాటు పడుచున్న విధమును ప్రపంచ ప్రస్థానము శోధించుచు చున్నవి. వేదమంత్రములు, బ్రాహ్మణములు, ఉపని