Isadore, Isidore, Isadora, Isidor - గ్రీకు పదములు, బలమగు ఈవి లేక బహుమానమని యర్ధము. Ivanna - హిబ్రూపదము, దేవుని కటాక్షమని యర్థము. John యొక రష్యాభాషా రూపపదమగు Ivan యొక్క స్త్రీ వాచక పదము. Ivy, Ivie - ఉత్పత్తి అర్థములు, తెలియవు, పూలభాషయుడు మైత్రి యని యర్థము. Ivory - ఇరిషుషదము, ఏనుఁగు దంతముఁ బోలిన తెలుపని యర్థము. ఐంద్రాలి గోత్రము - గర్గఉపగణము చూడుఁడు. ఐ. ఓ. యూ. (I.0. U.) -- వాణిజ్య సంబంధ పరిభాషాపదము. 1.0. U.. ఇది I owe you (నేను నీకు బాకీ యున్నాను) అనుదానికి గుర్తు. దీనికి స్టాంపు మొదలగునవి లేవు. ఇనను ప్రోనోటువలె వ్యాజ్యమున కర్త మగును. మొత్తము, వడ్డీ, తప్సీళ్లు, తీర్మానం విధానము, సంతకము ఇం దవసరములు. ఐకనోగ్రాఫీ (Ikonography) - పటములందు దైవలక్షణములుసహా దేవతా రూపములను చిత్రింపఁబడే నేని, ఆపటమునకు Ikon అని పేరు. అట్టి విద్యకు లేక శాస్త్రముకు Ikonography అనియెదరు. ఐకమత్యమానందమునకు దగ్గర మార్గము - ఆంధ్రలోకోక్తి. ఐక్యవాది, శైవము - ఇది చతుర్దశ శైవ, భేద మతములలో నొకటి (చూడుడు) ఈమతమునందు శివసమవాది శైవమునందువలెనే మలత్రయము, పదార్థత యము వివరింపఁబడినవి, (శివసమవాది శైవము చూడుఁడు.) ' మఱియు నీమతమునందు మాయయనునదియు, కర్మయను నదియు నధికముగఁ చెప్పఁబడినది. విశేషదీశును
|
|
గురునివలనఁగైకొని శివార్చన గేయొనరించుచుండిన అధ్వ (మార్గము) శుద్ధిగల్గి నిర్వాణము సిద్ధించును. అనఁగా కర్మనిగ్రహమును (ముక్తి) పొందనగునందురు. ఐగుప్తు దేశము (Egypt) - దీనిని పిరమిడ్సు గల ప్రదేశము (Land of Pyramids) అనియు, Land of Pharos అనియు, నైలు లేండ్ (నీలానదీభూమి) అనియు వాడుచుండుట కలదు. ఇది ఆఫ్రికా ఖండములోని దేశము. ఐటికి గోత్రము - ఔతధ్య ఉపగణము చూడుఁడు. ఐడియోగ్రాఫీ (Idiography) - " సుతకము, ట్రేడుమాక్కు, లాంఛనము (Coat of Arms) మొదలగు గుర్తుచిహ్నములను Idiograph అనియెదరు. దీని గురుతు అని యర్థము. వీట్ల లక్షణధర్మములు మొదలగు సర్వస్థితులంగూర్చిన కళ. ఐడియలిజమ్ (Idealism) -"Objects are not there till they are thought”. “ఒక పదార్థమునుగూర్చిన జ్ఞానము బయల్పడక పూర్వ మాపదార్థమే లేదు" అను నమ్మకము లేక సిద్ధాంతము. ఐతాయువు మగధబార్హద్రధసంతతి క్షత్రియుఁడు, తండ్రి శృతశ్రవుఁడు, పితామహుఁడు మార్జాలి, పుత్రుఁడు నిరమిత్రుఁడు. ఐతికాయన గోత్రము జమదగ్ని వత్సఉపగణము, కపి ఉపగణము చూడుఁడు. ఐతిశాయన గోత్రము - జమదగ్ని వత్స ఉపగణము, నిథృవ ఉపగణము, వితహవ్య లేక యాస్కగణము చూడుఁడు. ఐదువ - ౧. మంగళ సూత్రము, ౨. పసుపు, 3. కుంకుమ, ౪. గాజులు,
|
|