పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తయారుచేయడం కోసం సర్కార్ భూమి పేరిట ఒక కొత్త సాఫ్ట్ వేర్ ను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఇప్పటిదాకా 17 లక్షల రికార్డులు నమోదు చేయబడ్డాయి. ప్రహరీ గోడలు మరియు ఇనుపకంచెలు ఏర్పాటుచేయడం ద్వారా ప్రభుత్వ భూముల్ని రక్షించడం కోసం 2013-14 లో రూ. 30 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.

166. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.1,177 కోట్లు ప్రతిపాదించడమైనది.

ఆర్థిక శాఖ

167. ప్రజాధన నిర్వహణలో సమర్థత, పారదర్శకత, జవాబుదారీ తనాలను నెలకొల్పడం కోసం, ఆర్థికశాఖ, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సిఎఫ్ఎమ్ఎస్) ను రూపొందిస్తున్నది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సత్యమంతా ఒక్క చోటనే చూడగలగడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో అంతర్గతంగా సంబంధించిన వారందరికీ ఒకరితో ఒకరికి పూర్తిగా అనుసంధానం కలిగించడం, ఆర్థిక విషయాలతో సంబంధించిన బయటివారికి ఎలక్ట్రానిక్ సమాచారం అందించడం ఇందులో ముఖ్య అంశాలు. ఈ అప్లికేషన్ రూపకల్పన తుదిదశలోనూ, మరియు ప్రయోగదశలోనూ ఉన్నది.

168. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ-పేమెంట్ పద్దతి ద్వారా భూసేకరణ పరిహారాల చెల్లింపు, వనసంరక్షణ సమితులకు ఆన్లైన్ చెల్లింపు, పర్సనల్ డిపాజిట్ ఎకౌంట్ల నిర్వహణకు సాఫ్ట్ వేర్ రూపకల్పన, మరియు రాష్ట్రంలోని ట్రెజరీలలోనూ, పే అండ్ ఎకౌంట్ ఆఫీసుల్లోనూ బిల్ మానిటరింగ్ సిస్టమ్ మరియు ఈ-పేమెంట్ల వ్యవస్థాపన ప్రధానంగా చేపట్టబడుతున్నాయి.

52