Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

వెంకటశైలవిహారా!
శంకరముఖనిర్జరేంద్రసంస్తుతధీరా!
సంకోచరహితశూరా!
పంకజభవజనననాభిపద్మాధారా!

గద్య
ఇదిశ్రీమదలర్మేల్మగోత్తుంగస్తన శృంగసంగధారాధర
వేంకటేశ్వర కృపాపాంగలబ్ధ వాగ్వైభవనిరంతర
భగవతారాధనాధేయతూముకులపవిత్రసర్వేశా
భిధానపుత్ర రామదాస ప్రణీతంబైన యాం
ధ్రపదనిధానంబను నిఘంటువునందు
విశేష విఘ్న సంకీర్ణ నానార్థ అవ్యయ
నానార్ధవ్యయ వర్గయుత తృతీయ
కాండము ముగిసెను.
మంగళం భవేత్
సర్వము సమాప్తము.