పుట:ఆంధ్రపదనిధానము.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమతేరామానుజాయనమః.

ఆంధ్రపదనిధానము

ద్వితీయకాండము.

భూవర్గు

క.

శ్రీరమణీకుచయుగకా
శ్మీరాంకితకౌస్తుభవిలసితగరిమాసం
ధ్యారాగసంయుతసజల
ధారాధరసదృశవక్ష దానవశిక్షా.

1


వ.

అవధరింపుము. ద్వితీయకాండంబునందలి భూవర్గాది దశ
వర్గములను వివరించెద.


ఆ.

పంటవలఁతి నేల పైఁడిచూలాలును
పుడమి మన్ను మనన భువికభిఖ్య
లలరె; పైర్ల నేల పొలమన నుర్వర
కాఖ్యలౌను శౌరి యసురవైరి.

2

పంటవలఁతి, నేల, పైఁడిచూలాలు, పుడమి, మన్ను, మను అన భూమిపేర్లు. పైర్లనేల, పొలము అన ఉర్వరపేళ్ళు.

గీ.

చౌటనేలయు మఱియు నూసరము కారు
నేల యెద్దడినేల నా నెగడె నూష
రాఖ్యలై; మిత్తినాఁగ మన్ననఁగ మృత్తి
కాఖ్యలౌ భక్తమందార యఘవిదార.

3