పుట:ఆంధ్రపదనిధానము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలుదీవి అనఁగా జంబూద్వీపమునకు పేరు. జువ్విదీవి అన ప్లక్షద్వీపముపేరు. తమ్మిదీవి అన పుష్కరద్వీపముపేరు. బూరుగుదీవి అన శాల్మలద్వీపము పేరు. క్రొంచెదిన్నె అన క్రౌంచద్వీపముపేరు. ఱెల్లుదీవి అన కుశద్వీపముపేరు., సింగళము అన సింహళద్వీపము. టేఁకుదీవి అన శాకద్వీపముపేరు.

వారివర్గుముగిసెను.

కలహంసోత్సాహవృత్తము

సురవితానమకుటరత్న సురుచియుక్తపాదుకా
సురసపత్నగహన వర్గ శుచిశితాంకితాయుధా
సురమునీశహృదయపద్మ సుమరసౌఘబంభరా
సురనదీజనితపదాబ్జ సుగుణరాజిపేటికా

280

గద్య
ఇది శ్రీమదలర్మేల్మంగోత్తుంగశృంగారస్తనశృంగసంగత
ధారాధర వేంకటేశ్వరకృపాపాంగలబ్ధవాగ్వైభవ నిరం
తరభాగవతారాధనాధేయ తూముకులపవిత్ర సర్వే
శాభిధానపుత్ర రామదాసప్రణీతం బైనయాంధ్ర
పదనిధానంబను నిఘంటువునందు స్వర్గ
వ్యోమదిక్కాలధీవాక్ఛబ్దాదినాట్యపా
తాళభోగినరకవారివర్గకలి
తప్రథమకాండము
సంపూర్ణము.