పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

వేళ యెఱిఁగి విజృంభించి విమతుఁ ద్రుంచి
యైనఁ గొలిపించికొనియైన నలరు టొప్పు
నిట్టి శత్రుసమాశ్రయం బెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

150


చ.

తన కటు వేళగానితఱిఁ దాఁ బగవారల కెందు సర్వముం
గినియక యిచ్చి నిచ్చలును గ్లేశము వచ్చిన నైన నోర్చి యే
యనువుననైనఁ దాళికొని యన్యునినైనను జేరి క్రమ్మఱన్
మనుచు ధరిత్రిఁ గైకొనుట మంచిది యెంచగ ధర్మజుంబలెన్.

151


ఆ.

కారణంబు లేక కదిసి కూడఁగరాదు
ఘనునినైన నీచజనునినైన
కారణంబు లేక కలసిన క్షయమును
వ్యయము దోషములును వచ్చుఁగాన.

152


మ.

ఇలఱేఁ డొక్కొకకారణంబుననె తా నెవ్వారితోనైన నే
ర్పులఁ గూడందగుఁ గూడియుండిన యెడం బొల్పొంది చిత్తంబులో
పల నమ్మం గొఱగాదు తండ్రినయినం బాటించి దుష్టాత్మకుల్
దలఁప న్నమ్మినయట్టి సాదుజనులం దా రెందు హింసించుటన్.

153


వ.

ఇది షడ్గుణస్వరూపంబు. వీనిం గొందఱు మతస్థులు ద్వైదీ
భావసమాశ్రయంబులు సంధిమూలంబులె కావున సంధిగుణం
బొక్కటియును దండు వెడలుటయును విడియుటయు విగ్రహ
మూలం బగుటంజేసి యానాసనంబులు విగ్రహభేదంబులే కావున
విగ్రహగుణం బొక్కటియునుంగూడ నిట్టి సంధివిగ్రహంబులు
రెండుగుణంబులే యని పలుకుచుండుదురు. మఱియు బృహస్పతి