పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాధారము కానరాదు. ఆశ్వాసాంతగద్యముఁ బట్టి యది యొక్కనిపేరే యని తెలియనగును. పైపద్యమున బహువచన ముండుట పూజార్థము కావచ్చును.

కృతిపతి

ఈ కామందకకృతి నందికొనినది కొండ్రాజువెంకటాద్రిరాజు. ఈతఁ డారవీటివంశస్థుఁడగు కొండ్రాజు తిమ్మరాజు కుమారుడు. తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యమునకుఁ గృతిపతియగు విరూరి వేదాద్రిమంత్రికి యజమానియగు పెదసంగభూపాలునకుఁ జెల్లెలికుమారుఁడు.

ఈ వెంకటాద్రి రెట్టమత మనెడిజ్యోతిషగ్రంథమునుగూడ నంకిత మందినాఁడు.

మ.

కపటారాతివిభంజనోద్ధతమతీ! కర్ణాటసింహాసనా
ధిపతిప్రాప్తరమాధురీణ! కరుణాబ్ధీ! కంతుసౌందర్య! కా
శ్యపసద్గోత్రపవిత్ర! నమ్రతరవాచానైపుణీనిర్జితా
హిప! కామందకకావ్యనాయక! కవీంద్రేష్టార్థసందాయకా!

రెట్టమతము

ఆంధ్రకామందకగ్రంథమునఁ బ్రధమాశ్వాసాంతమున

క.

శ్రీ చంచద్భట్టరు చి
క్కాచార్య వరార్య శిష్య యతులితశౌర్య
ప్రాచుర్యధుర్య గుణర
త్నాచల జయలలిత ధైర్య నయవినయనిధీ.

ఆం. కామందకము ఆ 1. ప.65.