పుట:అహల్యాసంక్రందనము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

అహల్యాసంక్రందనము

     మేము శుంఠల మషే , మీరు [1]నేర్చినపాటి
                    యెరుగ మషే వేదమెల్ల జదివి
     యతివ నీవు [2]ద్వరోష్ట యయ్యేదినము లయ్యె
                    నగరికిఁ బోవకే నడుమ నెషులొ"
తే. అనుచు ఛాందసు లగు సోమయాజివరులు
     వెంట నంటంగ మధుమయవినయభరిత
     మంజుభాషల చేత సమ్మతులు చెప్పి
     వెడలి రప్పుడు వేలుపువెలవెలఁదులు.69
మ. గొనబుంజందురుకావిపావడలపైఁ గొమ్మించురాయంచడాల్
     మినుకుంజీరలకుచ్చెలల్ గులుకఁగా మిన్నేటిపొందమ్ము ల
     ల్లన వక్త్రాంబుజుపాళికిన్ మఱుఁగుగా హత్తించుచున్ గంతుమో
     హనదివ్యాస్త్రములోయనన్ వెడలి రొయ్యారంబుతో నచ్చరల్.70
ఉ. చిన్నిమిటారులో చికిలిచేసిన మారునిచిక్కటారులో
     వెన్నెలగుమ్మలో మెఱుఁగువెట్టిన కెంపుకడానిబొమ్మలో
     పొన్నలబంతులో మగుడఁబోవనిమిన్నుమెఱుంగుకాంతులో
     యెన్నఁగనంచు నభ్రచరు లిచ్చల మెచ్చఁగ వచ్చిరచ్చరల్.71
సీ. అశ్రాంతనవయౌవనారంభయౌ రంభ
                    శృంగారరసరేఖ చిత్రరేఖ
     రతిరహస్యజ్ఞానరాశియౌ నూర్వశి
                    అంగజాతాగ్నికి నరణి హరిణి
     పాటిలాధరజితపానక మేనక
                    హాటకసమరోచి యా ఘృతాచి
     తరుణులం దెల్ల నుత్తమ యా తిలోత్తమ
                    మణితమంజులభాష మంజుఘోష

  1. చదివిన
  2. బహిష్ఠ (?)