పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంపాదక హృదయం

సంపుటి: 6 సంచిక ; 4

అమ్మనుడి

సెస్టెంబరు 2020

జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపు?

ఆగస్టు సంచిక అచ్చుకు వెళ్లేందుకు సిద్ధమైన దశలో జులై 29న నూతన జాతీయ విద్యావిధానం విడుద లయింది. వెంటనే దానిపై సంపాదకీయంలోనూ దానితోపాటే 'జాతీయ విద్యావిధానం-2020: మంచీ చెడూ ' వ్యాసంలోనూ మా అభిప్రాయాలను కొంతవరకు వెలిబుచ్చాము. గడిచిన నెల రోజులుగా పత్రికల్లో, ప్రసారమాధ్యమాల్తో, వలగూడు (ఇంటర్‌నెట్‌ సమావేశాల్లోనూ ఎన్నో అభిప్రాయాలు, చర్చలు వెలుగుచూశాయి. ఇంకా విస్తారంగా ఈ పని జరిగుండవచ్చుగాని, ఇప్పుడున్న కోవిడ్‌ గందరగోళం వల్ల అదంతా కుదించుకు పోయింది.

ఆరేళ్లుగా మోదీ ప్రభుత్వపాలననూ, విధానాలనూ మనం గమనిస్తున్నాం. దేశం మొత్తం మీద రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని సమర్థించే లేదా తటస్థంగా ఉండే జనాఖిప్రాయమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. వామపక్ష పార్టీలు, ఇతర (ప్రతిపక్షాలూ రాజకీయంగా బలమైన వ్యతిరేకతను కూడగట్టి, ఉద్యమంచగల సమైక్యశక్తిని

జాతీయ ఐక్యతా, ప్రగతీ లక్ష్యాలుగా ముందుకు సాగుతున్నామంటున్న పాలక పార్టీ, అందుకై అనుసరిస్తున్న విధానాల పట్ల శంకలున్నవారూ, ఖిన్నాభిప్రాయాలున్నవారూ ఆ పార్టీ సానుభూతిపరుల్లో కూడా చాలా మంది ఉన్నారు. కాని, వారికి ప్రతిపక్షాల చిత్తశుద్ధిపై గాని, సమర్థతపై గాని నమ్మకంలేదు. ఈ పరిస్థితే ఇప్పుడు జాతీయ విద్యావిధానం పైన కూడా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో కొంతవరకు అడ్డుగోడగా నిలిచింది. విద్యా భాషారంగాల్లో దేశీ విదేశీ పెట్టుబడిదారీ శక్తులు ప్రభుత్వాలనే గాక, ప్రతిపక్షాలను కూడా నియంత్రించగలుగుతున్నాయి. అందువల్ల విద్యా, భాషారంగాల్లోని నైతికశక్తులు ఒంటరివైపోయి, ప్రజలపైనా ప్రభుత్వాలపైనా అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేయదలచుకొన్నా ఎదురులేకుండాపోతున్నది. కొత్త జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించెముండు రామ్ర్రాలను కూడా కలుపుకురావాలనే ముఖ్యవిషయాన్ని అంతగా పట్టించుకోలేదు (రాజ్యాంగంలో విద్య కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడీ జాబితాలోని అంశమన్న సంగతి తెలిసిందే!).

కొత్త విద్యావిధానంలోని వివిధ పాలనాంశాల అమలుకై పలు చట్టాలను తేవలసి ఉంది. ఆ సందర్భంగా చట్టసభల్లో చర్చకు ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఎవరు ఎంతవరకు కీలకాంశాలను తెరపైకి తేగలరో చివరకు ఆ చట్టాలు ఎలా బయటకువస్తాయో చూడాలి. ఆ చట్టాల అమలు ఎంత ఖచ్చితంగా జరగగలదో, ప్రకటిత ఆశయాదర్చాలు, లక్ష్యాలు ఎంతవరకు నెరవేరతాయో కూడా మనం వేచి చూడాల్సిందే.

కొన్ని ముఖ్య అంశాల గురించి మాట్లాడుకొందాం. విద్యాప్రణాళికలోనూ పాఠ్యప్రణాళికలోనూ చాలా మార్సులు తెస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన “సుస్థిర అభివృద్ధి” లక్ష్యాల ప్రకటనలో మనదేశం కూడా సంతకం చేసింది. దాని ప్రకారం విద్యను సమస్త అవసరాలకు, శాస్తసాంకేతికరంగ మార్చులకు తగ్గవిధంగా రూపొందించుకోవాలి. దీనికనుగుణంగా మన జా.వి.వి.ని సిద్ధంచేయడంతో పాటు దాని ముందున్న మరొక ప్రధాన బాధ్యత- ప్రభుత్వం ఆశిస్తున్న భాషాసాంస్మతిక అంశాలను, విధానాలను పొందుపరచడం. అందువల్ల దృఢమైన భారత జాతీయతను తీర్చిదిద్దేందుకై మన భాషల్లోనూ, సాంస్కృతికతలోనూ ఉన్న వైవిధ్యాలను గుర్తించకుండా సంస్కృతాన్ని హిందీని సమున్నతంగా నిలబెట్టే లక్ష్యంతో జా.వి.వి.ని రూపొందించారు. ప్రపంచంలోనే సంఖ్యలోనూ, ప్రాచీనతలోనూ తొలి వరుసలో ఉండే తెలుగు వంటి ద్రావిడభాషల ప్రత్యేకతను పక్మనపెడుతున్నారు. ఎంతో తెలివిగా సూచించిన మార్గదర్శకాల్లో ఈ కుట్రపూరిత ధోరణి అర్థమవుతూనే వుంది. దీనిపై చర్చ జరగాలి. ఇదేవీధంగా జనసంఖ్యలో తక్కువగా ఉన్న గిరిజన భాషల విషయంలోనూ బాధ్యతను ప్రకటించలేదు.

సాంస్కృతికంగా కూడా మన దేశంలో ఉన్న నైవిధ్యాన్ని (ప్రేమించి, అందరినీ కలుపుకొచ్చే విధంగా “సమైక్యతను