పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2021 ఆగస్టు 29: గిడుగు రామమూర్తి 158వ జయంతి

తెలుగు భాషాదినోత్సవం తెలుగు న్వాఖిమాన ఉద్యమానికై పిలుపు


గిడుగు రామమూర్తి గారు చూపిన దారి ఇప్పటికీ, తెలుగు వారికి దారిదీపంగా నిలిచివుంది. ఆయన నడిపిన ఉద్యమాన్ని వాడుక భాషోద్యమం/వ్యావహారిక భాషోద్యమం అనడం నాటికి సరిపోయింది. ఆనాడు ఆఅ మహనీయుని పోరాటం అంతా- పండితుల చాదస్తం వల్ల ప్రజలకు దూరమైపోతున్న తెలుగు భాషను ప్రజాస్వామీకరించడం కోసం. ఆవిధంగా ఆయనది గొప్ప సంస్మరణోద్యమం. ఆ ఉద్యమం అన్ని రంగాల్లో భాషను ఉపయోగించుకోవాలనే ఉత్సాహాన్నీ భైర్యాన్నీ తెలుగువారిలో నింపింది. ఆయన 1940లో కన్నుమూశారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భాషా రాష్ట్రాల ఏర్పాటు జరగడంతో పాలనలో, బోధనలో ప్రజల భాష పూర్తిగా ఎదుగుతుందనీ 'తెలుగు ప్రజలం ఉన్నతంగా వికసించగలమని పెట్టుకొన్న ఆశలన్నిటినీ మన పాలకులు వమ్ముచేశారు. పి.వి. నరసింహారావు, ఎన్‌.టి.రామారావు వంటి అతికొద్దిమంది ముఖ్యమంత్రులు తప్ప తక్మినవారు తెలుగుపట్ల పట్టనితనంతో వ్యవహరించారు. రెండు తెలుగు రామాలు ఏర్పడ్డ తరువాత ఈ పరిస్థితి మరింత ఫోరంగా తయారైంది. పరిపాలనలో రెండురామ్ట్రాల్లోనూ తెలుగు వినియోగం అడుగంటింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే నేటి ముఖ్యమంత్రి గారి తెలుగు వ్యతిరేక విధానాలవల్ల అధికారులు తెలుగు వాడకాన్ని పూర్తిగా మానేశారు. భాషారామ్ష్రాల ఏర్పాటు యొక్కమౌలిక లక్ష్యమైన “ప్రజలభాషలో పాలించాలి అనే” సూత్రానికే ఇది గొడ్డలిపెట్టు. ఇక పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించారు. పై చదువుల్లో తెలుగు వాడకాన్ని రద్దు చేశారు. అంతంత మాత్రంగానైనా మాతృభాషలకు విలువ ఇస్తున్న నూతన జాతీయ విద్యావిధానాన్ని కూడా పట్టించుకోవడం లేడు. రాజ్యాంగానికి, విద్యాహక్కు చట్టానికి, ఇతర అన్ని సూత్రాలకు పూర్తి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అణిచివేత విధానాన్ని అమలు చేస్తున్నది. పైగా తెలుగు అకాడమీని 'తెలుగు- సంస్కృత అకాడమీ” గా మార్చుచేస్తూ దేశంలోనే ఎక్కడా లేని ఒక విచిత్రమైన ప్రభుత్వ ఉత్తర్వును ఇచ్చారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధపడాలి. పరిపాలనలోనూ పాఠశాలల్లోనూ తెలుగును తొలగించడమంటే మన తెలుగుజాతి ప్రాణమైన తెలుగుభాషను కోల్పోవడమే. భాష నశిస్తే జాతినశిస్తుందని మనకు తెలిసిందే. కనుక మన భాషను మనం కాపాడుకోవడానికి స్వాఖిమాన ఉద్యమానికి మనం పూనుకోవాలి. ఇందుకు తగిన సమయం ఇది. గిడుగు జయంతి- తెలుగుభాషాదినోత్సవ సందర్భాన్ని ఈ ఉద్యమానికి అవకాశంగా తీసుకోవాలి అని కోరుతున్నాం. ఇండుకు తెలుగు భాషోద్యమకారులు, రచయితలు, కళాకారులు, ప్రజాసంఘాలు, ప్రజలు అందరూ పూనుకొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం ముందుకు తేవలసిన నిక్కచ్చులు(డిమాంద్లు) మూడు: 1. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన తెలుగులో జరగాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ తెలుగులో ఉందాలి. . 2. జాతీయ విద్యావిధానం ప్రకారం పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగును వినియోగించాలి. 8. తెలుగు అకాడమీని తెలుగు కోసమే నడపాలి. సంస్కృతాన్ని గానీ మరొక భాషను గానీ తెలుగు అకాడమీపై రుద్దకూడదు. ఇందుకు సంబంధించిన జి.జ.నెం: 81/10. 7. 2021ను రద్దు చెయ్యాలి. జిఒ.నెం. 21/16. 6 2020ను సవరించాలి. “కరోనా వ్యాప్తి వల్ల నిబంధనలను పాటిస్తూ కొద్దిమందితో తగు కార్యక్రమాల్ని నిర్వహంచండి. జాలవేదిక (వెబీనార్‌) సహాయంతో సమావేశాలను నిర్వహంచండి. పెద్ద, చిన్న పత్రికల్లోనూ, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ తదితర అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పాలు పంచుకోండి. కరపత్రాలను పంపిణీ చేయండి.జిల్లా, స్థానిక స్థాయిలలో ప్రభుత్వ అధికారులను జిల్లా కలెక్టర్‌, ఆర్‌.డి.ఒ. కమిషనర్‌ మొ॥వారిని కలిసి వినతి పత్రాలను అందచేయండి. పై మూడు డిమాండ్‌ల సాధన పైనే మనం (శ్రద్ధ వహించాలి. అన్ని కార్యక్రమాల్లోనూ గిడుగు స్ఫూర్తిని ముందుకు తేవడం, ఆయన ఆదర్శంతో ముందుకు సాగడం ముఖ్యం. ఆగస్టు 29 నుండి సరికొత్త చైతన్యంతో ముండుకు సాగుదాం. తెలుగు భాషోద్యమ సమాఖ్య శాఖలు, మిత్రసంఘాలు, రచయితలు, కళాకారులు, ఇతర ప్రజాసంఘాలు అందరూ ముందడుగు వెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పటల రమేష్‌బాబు, అలీ అధికుడు తెలుగు భాషోద్యమ సమాఖ్య 98480 16136 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఆ ఆగస్టు-2021