పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమ్మనుడి చదువరి పలుకులివి...

నవంబరు సంచికలో మధురాంతకం నరేంద్ర గారు పత్రికల వైభవధశ గురించీ, చరమదశ గురించీ చాలా ఆవేదనతో రాసినది చదివాక నాకు ఒక సూచన చెయ్యాలనిపించింది. “అందరికీ అందుబాటులో వుండేలా కొన్ని పత్రికలుండాలి గదా?” అన్నారు. నిజమే. అందుకు మనం ఒక పని చేయవచ్చును. ఈ విషయం గురించి రాసిన ఆవేదనని ప్రచురించిన పత్రికనే నిలుపుకుంటే ఎలా వుంటుందో ఆలోచించవచ్చును. అమ్మనుడి పత్రిక ప్రధానంగా భాషా సంబంధమైన విషయాలమీద దృష్టి పెడుతున్నప్పటికీ, కథలకీ, సీరియల్‌ నవలలకీ కూడా వేదికగా మారేలా, నరేంధ్ర గారి వంటి రచయితలూ, అవి చదవ గోరీ పాఠకులూ కొన్ని ప్రయత్నాలు చెయ్యవచ్చును. ఈ పత్రికకి చందాలు కట్టడం, కట్టించడం, విరాళాలు ఎంత వీలైతే అంత పంపడం, సేకరించడం చేస్తే కొంత ఉపయోగంగా వుంటుందనిపిస్తోంది. సాహిత్యం చదివే వారు, సాధారణంగా మేధా శ్రమలు చేసే విద్యావంతులై వుంటారు. శారీరక శ్రమలు చేసే వారితో పోలిస్తే వీరికి జీతాలు గానీ, పెన్‌షన్లు గానీ, రిటైర్‌ మెంటు తర్వాత వచ్చె 'బెనిఫిట్స్‌” గానీ చెప్పుకోదగ్గ స్తాయిలోనే వుంటాయి. సినిమాలకీ, హోటళ్ళకీ, పెళ్ళిళ్ళకీ, పుట్టిన రోజు ఫంక్షన్లకీ, బట్టలకీ, ఫర్నిచర్‌ కీ, వాహనాలకీ, నగలకీ, విహార యాత్రలకీ, వగైరాలకి ఎంతో కొంత ఖర్చు పెట్టని మేధా శ్రామిక కుటుంబాలు అరుదు. సాహిత్యం పట్ల అసక్తి వున్న రచయితలూ, పాఠకులూ ఈ కోణంలో ఆలోచిస్తే కొన్ని షత్రికలైనా అద్భశ్యం కాకుండా కొన్నాళ్ళయినా మనగలుగుతాయనిపిస్తోంది. చివరిగా, ఇలా ఒక సలహా ఉచితంగా ఇచ్చి తప్పుకోవడం బాగుండడు కాబట్టి, నా తరపునించీ, నా మిత్రుడు జె.యు. బి.వి. ప్రసాద్‌ తరపునించీ 80,000 (మొత్తం ముప్పయ్‌ వేలు) “అమ్మనుడి కి విరాళంగా పంపుతున్నాను. వీలైనప్పుడల్లా పంపిస్తూ వుంటాము. - బి.ఆర్‌. బాపూజీ (పెన్‌షన్‌ వచ్చె రిటైర్డ్‌ ప్రొఫెసర్‌)


స్పందనలు

పదనిష్పాదననకళ; డిసెంబరు సంచికలో “నిజానికి తెలుగువారి దృష్టిలో తెలుగూ, సంస్కృతమూ రెండు వేఱువేఱు భాషలు కావు. మన కావ్య సంప్రదాయాన్ని అనుసరించి, తెలుగుని యథేచ్చగా సంస్కృతపదాలతోను, సమాసాలతోను నింపివేయవచ్చు” అని తెలిపారు. మరి, అవసరాలకు తగ్గట్టు మనం కొత్తపదాల్ని తయారు చేసుకోవాలి అనే సందేశంతోనే కదా మీరు వ్యాసాలు రాస్తున్నారు. కావలసిన మాటలన్నీ సమృద్దంగావున్న సంస్కృతాన్ని పూర్తిగా తీసుకుంటే పోలా? ఇంకా తెలుగుజాతి అంటారెందుకు? “పదాలు ఒక జాతియొక్క మేధశ్చరిత్రని సూచిస్తాయి. పరాయి పదాల్ని భారీగా వాడడమంటే ఒక జాతిగా మనకి బుద్దిలేదని, స్వకీయత(originality) శూన్యమనీ ఒప్పుకోవడమే అవుతుంది” - అని రాశారు. దీని అర్థమేమిటి వాచస్పతిగారూ? -డాక్టర్‌ వెన్నిసెట్టి సింగారావు, గుంటూరు

పదనిష్పాదనకళా: నాలుగు నెలలుగా ''అమ్మనుడి లో వస్తున్న 'పదనిష్పాదనకళ ఎంతో ఆసక్తితో చదివిస్తున్నది. శాస్త్రీయంగా వివరిస్తున్నారు. ఇంతకీ మీ రచనలో సంస్కృతపదాలూ, పదబంధాలూ పువ్మలంగా దర్శనమిస్తున్నాయి. చక్కని తెలుగుమాటలను వాడుకోదగినచోట కూడా సంస్కృతాన్నే ఆశ్రయించడం తెలుగుదనమెట్లాఅవుతుంది! తెలుగు ధాతువులనుండి మాటలను పుట్టించే ప్రయత్నం అసలే లేదు! మిమ్మల్ని([మీ రచనను) ఎలా అర్థంచేసుకోవాలి? -దాక్టర్‌ పోతురాజు శ్రీనివాసరావు గుంటూరు

'పెన్నానది పేర్ల వెనుక చరిత్రా; రాష్ట్రంలోని నదుల పుట్టుక, పయనం, ప్రవహించే గ్రామాలు, ఉపనదులు, తీరం వెంబడి కొలువైన పుణ్యక్షేత్రాలు, ప్రముఖులు, సాహితీ చారిత్రక ప్రశస్తి గురించి గ్రంథరచన చేస్తున్న నాకు డా॥ అప్పిరెడ్డి హరినాథరెడ్డి పెన్నా గురించి వాసిన వ్యాసంలోని శాసనాలు, సాహిత్యంలో పెన్నా ప్రస్తావన గురించిన సమాచారం కొంత ఉపయుక్తంగా వుంది. - అంగత వరప్రసాదరావు, డైరెక్టర్‌, భూగర్భజలం & జలగణన శాఖ, అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

'జగమునేలిన తెలుగూ: ఈ నవలను పుస్తకంగా వెలువరించండి. చాలా ఆసక్తికరంగా ఉంది. రచయిత్రికి అభినందనలు. ఈ రచనను ఒక పుస్తకంగా వెలువరిస్తే బాగుంటుంది -దాక్టర్‌ నాగఖైరవ ఆదినారాయణ ఒంగోలు

ఆఫ్రికాలో అమ్మనుడి....: పత్రికలో గిరిజన సంస్కృతి, సాహిత్యం, ఆచారవ్యవహారాలు, వారిపట్ల ప్రభుత్వాల చిన్నచూపు మొదలైన అంశాలపై శక్తి సంస్థ నిర్వాహకులు డా|| పి. శివరామకృష్ణ వ్రాస్తున్న వ్యాసాల ద్వారా మైదానంలో నివసించే వాళ్ళకు తెలియని విషయాలను పూసగుచ్చినట్లుగా తెలియచేస్తున్నారు. వారి కృషి అభినందనీయం. డిసెంబర్‌ పత్రికలో గుగి జైలు రచన 'బందీలో తనకు స్ఫూర్తినిచ్చిన విషయాలను తడుముతూ '“పరాయిభాష ' పరాయి సాహిత్యం మన జ్ఞాపకాలను, ఆయాదేశకాలాలతో మన అనుబంధాలను చంపేస్తాయి అని ఆయా భాషల శాఖల పాఠాలు మార్చిస్తాడు” -అని పేర్మ్గానడం మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి హెచ్చరికగా ఉంది. - చెరుకుపల్లి శ్రావణి, హైదరాబాదు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

5