పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక


ఈపుస్తకమునందలి 'అమరావతీస్తూపము', 'మనప్రాచీన విద్యాసంస్థలు' అనువ్యాసములు ఆంధ్రపత్రిక, శుక్ల (1930), అక్షయ (1926) ఉగాది సంచిక;లయందును, 'అనాదృతవాఙ్మయ'మను వ్యాసము 'సమదర్శిని' శుక్ల (1930) ఉగాది సంచికయందును; 'ప్రాచీన వృత్తివిద్యావిధానము', 'బౌద్ధవాఙ్మయము: పరిశోధన' అనునవి 'భారతి' (క్రోధన: ఫాల్గుణముల్ ప్రమోదూత: శ్రావణము) యందును, ప్రకటితములయినవి. కొంత నూతన విషయమును జేర్చి మొదటివ్యాసము నించుక విపులీకరించి వ్రాసితిని. మిగిలిన వానిలో నచ్చటచ్చట కొద్దిమార్పులు చేసితిని. అనావశ్యకమని వ్యాసవిషయముల కాకరముల నిం దుదాహరింపలేదు.

ఈవ్యాసములు గ్రంథరూపమున వెలయుటకు కారణభూతులయిన శ్రీ డాక్టరు, చిలుకూరి నారాయణరావు ఎమ్. ఏ., ఎల్. టి., పిహెచ్. డి., వారికి నాకృతజ్ఞతాపూర్వకవందనములు.

మల్లంపల్లి సోమశేఖరశర్మ