25 1. అమరావతీస్తూపము ణ ముల ననుసరించి శ్రీ పర్వత మనునది 'మహాచైత్య విలసిత మయిననాగార్జునునికొండ యగు నేమోయని తోచుచున్నది. ఆ శాసనములందు ' శ్రీపర్వతము' కాశ్మీరము, గాంధారము చీనా, అపరాంతము, వంగము, వనవాసి, 'తాంబపణ్ణి ద్వీపము మొదలగు దూరస్థ దేశములందు బౌద్ధ మతమును వ్యాపింపఁజేయు బౌద్ధుల కత్యంత పవిత్ర క్షేత్రమనిఁ చెప్ప బడినది. ఈ ప్రాంతమున నుండియే, 'అనఁగా కృష్ణానదీతీరస్థ మయిన గూడూరు(కొడ్డూర) నుండియే బౌద్ధులు బర్మా, సయామ్ మొదలగు దేశములకు ఓడ నెక్కి బౌద్ధ మత బోధ అరుగు చుండువారు. బుద్ధుని పిదప బుద్ధుని యంతటి వాఁ డయిన నాగార్జునాచార్యుని కావాసమయిన స్థల మగుట చేత పూజ్యార్థమున నాపర్వత ప్రదేశమునకు శ్రీ వారు, శ్రీపాద ములు అనునట్లు శ్రీ పర్వతమను నభిధానము కలిగియుండును. బౌద్ధ మతము క్షీణించి, దాని మీఁది గౌరవాదరణములు నశించిన మీఁదట నా పర్వతనిలయము వట్టి... 'పర్వతనిలయము ' వట్టి ' నాగార్జునుని కొండ' నాఁ బరఁగి యుండవచ్చును. త న్నాదరించిన.. దరించిన సాతవాహన భూపతికొఱకు ఆర్య నాగార్జునుఁడు బుద్ధ భగవానుని సుగుణసంపద కంటికిఁ గట్టి నట్లు వర్ణించుచు, ఛందోబద్ధమయిన యొక " సుహృల్లేఖ
పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/31
స్వరూపం