పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గానవచ్చు నర్వాచీన రీతులను వేఱుపఱిచి చూచినయెడల, ప్రాచీనరీతుల ననురించికూడ ఇచ్చటి ప్రాథమిక స్తూపము క్రీ. పూ. రెండువందల ప్రాంతమున వెలసినదిగనే కన్ప ట్టును. అశో‌క ప్రేపితుఁడయి యాంధ్రదేశమున కరుదెంచిన మహాదేవ భిక్షువు స్థాపించిన చైత్యక పంథ కిది ప్రధానపీఠ మగుటచేతను, అటుతరువాతి కాలపు శాసనములం దిది మహాచైత్య మని పేర్కొనఁబడుటచేతను ఒకవేళ నిది‌ యశోక చక్రవర్తి యాదరణమున వెలసిన దన్న ననవచ్చును కాని యిది యూహమాత్రమే. ప్రారంభమున వెలసిన చైత్యము (స్తూపము) చుట్టును కాలక్రమమున పెక్కు చైత్యములు వెలసి, యిది బహువిధాలంకార ప్రాకార పరి శోభితమయి, చూచువారలకు నేత్రపర్వ మొనరించుచు వార్త కెక్కినది.

మహాదేవుని నాఁటనుండి యీధాన్య కటక మహా చైత్యక్షేత్రము ఆంధ్ర మహాసాంఘికులకు ప్రధానమయిన పవిత్రపీఠముగ నుండినది. ధాన్యకటకము రాజధానిగ ఆం ధ్రదేశమును బరిపాలించిన ఆంధ్రవంశ్యులగు శాతవాహ నులు బౌద్ధమతము నాదరించి యీచైత్యమును బెక్కు విధ ములఁ బెంపొందించిరి. ఈవిధమున నిది క్రీ.