పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన 'కునాల', “దశరథు'ల వెనుక 'సంప్రతి రాజ్య మునకు వచ్చి క్రీ. పూ. 220 మొదలు 211 వఱకు పరి పాలించెను. అశోకచక్రవర్తికి బౌద్ధమత మనిన నెంతటి యభి నివేశముండెనో యీతనికి జైనమత మనిన నంతిటి యభి మూన ముండెనని, అశోకునివలెనే యాతఁడును ఆంధ్ర, ద్రమిళ దేశములకు మతబోధకుల నంపి, జైనమతమును వ్యా పింపఁజేసెనని హేమచంద్రుని పరిశిష్ట పర్వము ననుసరించి తెలియుచున్నది. సంప్రతి ప్రయత్నములవలన జైనమత మాంధ్రదేశమున బాగుగ వ్యాపించినను వ్యాపింపక పోయి నను మహాదేవ భిక్షువు తలపెట్టిన బౌద్ధమత వ్యాపన ప్రయ త్నములకుఁ గొంత యాటంకము కలిగిన కలిగియుండును. అయినను తరువాతి కాలమున తెలుఁగుదేశమున బౌద్ధము సర్వజనాదరణీయ మయిన మతమయి వర్ధిల్లె ననుటకు అంధ్ర దేశమున నందు ముఖ్యముగ కృష్ణా, గుంటూరు మండ లములందుఁ గానవచ్చిన, కానవచ్చుచున్న బౌద్ధస్తూపాదిక ములే తార్కాణము.

అమరావతీ స్తూపము

భక్తులయిన యాంధ్రదేశ కళొపాసకులు బుద్ధ భగ వానుని పాదపీఠిని కానుకగా సమర్పించిన యట్టి పూజా కుసుమములలో అమరావతీ స్తూప మొకటి. ఇది కృష్ణానదీ