పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జిత్రితములయినవి. బౌద్ధయుగమున స్తూపము బుద్ధభగవతత్యర్థముగ సమర్పించు నొకకానుకయై, తన్నిర్మాణము బెద్దగా ధర్మావలంబకులకు పుణ్యప్రదమయిన ధర్మకార్య మయినది.

అలంకార పరిశోభితములయి కనులు కోరగించు దివ్యసుందర విగ్రహములు, చూడ ముచ్చట యయిన పని, హృదయరంజకముగఁ జేతితో వ్రాసిన చిత్రమ మొదలయిన కళావిదగ్ధములగు కృతు లున్నచోటికి పొందని బౌద్ధులకు బుద్ధుని యాదేశ మున్నను వారి నిష్కల హృదయములు సంసారదుఃఖము నంతరింపఁజేయ నవతరించిన ప్రేమావధి బుద్ధ భగవానునియెడల భక్తిరస ప్రకర్ణములయి, వారి నారాధకులుగ దిద్దినవి; ఈరీతిని కాలక్రమమున భక్తిరహితమయిన మతమున భక్తియు, ఆరాధన రహితమయిన మతమున ఆరాధనమును మొలకెత్తెను. అట్టి యాదేశము నొసంగిన బుద్ధ భగవానుని చుట్టునే నిధానములయిన మనోహర శిల్పకావ్యము లెన్నియో చితములై ఆదిబౌద్ధముస్వరూపస్వభావములనే సంపూర్ణముగా మార్చి వైచెను.

భక్తులయిన బౌద్ధ శిల్పుల సిద్ధహస్తముల స్తలనిర్మాణ మొకకళయై క్రమ పరిణామము నొంది వన్నె వాసియుఁ గాంచెను. ఇందువలన స్తూపములలో అతి