పుట:అభాగ్యోపాఖ్యానము (Abhagyopakhyanamu).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
గీ.	బొంకుటకుఁజేతగాక యీఱంకులాడి ।నోర గుటకలు మ్రింగుచు నూరకున్నఁ
	గాంచి కోపించి యొక పెద్దకఱ్ఱతోడ| వీపు బద్దలుగాఁగొట్టె వెలఁదినతఁడు. ౭౦

ఉ.	కొట్టినమొత్తుకొంచు నడి గ్రుడ్డుల నీరొగిఁగ్రుక్కుకొంచుఁబెన్
	ఱట్టులఁబెట్టివీధిఁఱాగతనంబునఁ బాఱవచ్చి యీ
	కట్టిఁడిఱంకులాడి తనకాపురమూడుటకోర్చి దేవళం
	బిట్టులుదూఱెఁ గన్గొనఁగనిట్టివెయౌఁ గద జారిణీగతుల్. ౭౧

వ.	అని కురంగగమన సవిస్తరంబుగా నా మెఱుంగు బోఁడి తెఱం గెఱింగించి తలపుచేరి
	యిట్లని పిలువందొడంగె. ౭౨

ఉ.	డాయనుభీతిఁబొంద మగఁడా యనుఁ దల్పులు తీయరాదె రం
	డాయనుఁ బల్కవేమి చెవుడాయను సొమ్ములు వెట్టు ఱంకుముం
	డాయను వేగరావె మొఱడాయను లోపలఁజేరి యేడ్వగా
	డాయను సిగ్గుఁబూనుటిపుడాయను నెచ్చెలి మాటిమాటికిన్. ౭౩

తే.	గొంతుపగులంగవినువారికెంతోచెవులు ।తడకలుగట్ట నాలుకపిడచవాఱ
	నెంతయార్చినఁ జెవిఁ జొరనీకయుండె ।దున్నపోతుపై వర్షంబు తొరఁగినట్లు. ౭౪

చ.	తడిసిననుల్కకుక్కిగతిఁ దామ్రశిరోరూహ యంతకంతకుం
	గడుబిగియంగఁజూచి తటకాపడి గుండెనుఱాయిపడ్డ వే
	నడవఁగలేక గోతిదరినక్క తెఱంగునఁ గాచియున్నయా
	చెడుదనుజుండు నెత్తికిఁకఁజేతులువచ్చెనటంచు రోఁజుచున్. ౭౫

ఆ.	కొంతసేపు పాడుగుడిచెంతఁగూర్చుండి ।రోదనంబుచేసి రోసి కూర్కి
	తలుపుతీయుజాడఁ గలనైనఁ గానక ।విసిగి దూతిఁగొంచు వెడలెగుడిని. ౭౬

చ.	అటువలె దేవళంబపుడె యాయమతోడను దాననేంద్రుఁ డు
	త్కటనుగుకన్కతో వెడలి గార్దబగామినిమీఁదిప్రేమచేఁ
	దటుకునఁ బాయలేక నుదిఁదాలిమిఁ దాలిచి పొంతనిల్చి మి
	క్కుటమగుదీనభావమునఁ గూర్మిబయలడ్ప దూతికిట్లనున్. ౭౭

క.	ఓసీననునీవిపుడీ ।కానరాని భగాత్రి తోడఁ గలిపెదవేనిన్
	గానులపేరిచ్చెదనీ ।యాసకుఁదగినట్టీరొక్క మటులుండంగన్. ౭౮

తే.	అనిన నదియెంతపనియని యపుడె బయలు ।దేఱి దేవాలయంబును జేరఁబోయి
	మెల్లఁగా మిత్రురాలిని మేలమొప్పఁ ।బిలిచినంతనెయాజెంత తలుపుతేసె. ౭౯

క.	తలుపునుదేసినవెనుకను ।బలుకులుచెవిలోనఁ గొన్ని బహురమ్యముగా
	వలుచొప్పఁగఁజెప్పిన విని ।యలఖరవాణియు విచారమంతయుఁదీఱన్. ౮౦