పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

అనుభవసారము


తరువోజ.

నవరసాంచితభక్తి నానాప్రయుక్తి
         నలిఁ బాల్కుఱికి సోమనాథుండు సెప్పె
ప్రవిమలం బై యనుభవసార మనఁగ
         [1]భ్రాజిల్లు సద్భక్తిపరు లుత్సహింప
సవిశేషభక్తిమై సద్భక్తసభలఁ
         జదివిన విన్న నాసక్తి వ్రాసినను
గవితావిశేషంబు గారవించినను
         గరుణించు శివుఁడు మంగళమహాశ్రీలు.

243

————

  1. శివభక్తవరులు మించినవేడ్కఁ బొగడ

చెన్నపురి : వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్‌సన్స్‌వారి

'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము - 1-8-1955