పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

57


శంభుభక్తులపాదజలములు ద్రావిన
          తల్లిచన్నులపాలు ద్రావఁ దప్పు


గీ.

హరగణప్రసాద మర్థి భోగించిన
నితరభోగవాంఛవితతి యాఱు
ప్రాణలింగమథనభవ్య[1]జీవన్ముక్తి
కెనయువేఱుముక్తి గనఁగఁ గలదె?

220


ఉ.

జంగమభక్తిలింగపరిచర్యల మీఱుట యుత్తమంబు త
జ్జంగమలింగపూజ లది సామ్యము [2]సల్పుట మధ్యమంబు మున్
జంగమలింగపూజ యెడ సల్పుచు లింగముఁ గొల్చుచున్కి యె
న్నంగఁ గనిష్ఠ మౌట శరణప్రతిపత్తియె ముఖ్య మెమ్మెయిన్.

221


క.

లింగాభ్యర్చన లింగము
నంగమునకు, జంగమార్చనం బది మదిఁ దా
లింగంబు ప్రాణమునకు న
భంగుర మగుభక్తిచేత భక్తినిధానా!

222


క.

జంగమపరాఙ్ముఖుం డై
లింగార్చన సేయునతని లీల [3]దలంపన్
వెంగలియై శవమునకును
శృంగారము [4]సేయునట్లు శివభక్తినిధీ!

223


క.

అవిరళగురుకారుణ్య
ప్రవిమలశుద్ధప్రసాదపరిపూర్ణానం

  1. జనయు జీవన్ముక్తి కెనయుఁ గలదె
  2. సల్పక
  3. దలిర్పన్
  4. జేసి