పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

అనుభవసారము


నణిమాదిసిద్ధగుణైశ్వర్యసంపన్ను
         లజరామరులు విభవాఢ్యు లాత్మ


గీ.

చరులు వితతసర్వసంగపరిత్యాగ
చరితు లప్రతిములు స్వచ్ఛు లుభయ
కర్మవిరహితులు జగత్పావనులు కాల
కాలు లభవుభక్తగణము లనఘ!

202


చ.

అతులితశాంతచిత్తు లమలాత్మకు లాతతధర్మసంయమ
వ్రతు లకలంకచిత్తు లనివారితకర్ములు దీనరక్షు లం
చితగురుభక్తియుక్తులు వశీకృతశుద్ధమనస్కు లుద్భవ
స్థితిలయ[1]కార్యకర్తలు విచిత్రచరిత్రులు భక్తు లల్పులే?

203


ఉ.

లోకమునందుఁ బుట్టియును లోకవిరుద్ధు లనంతజీవన
వ్యాకులచిత్తు లయ్యు నధనార్థు లనారతధర్మసత్క్రియా
నీకసమేతు లయ్యు ఫలనిష్ప్రియు లంగవిధేయు లయ్యు దూ
రీకృతదుర్మదేంద్రియచరిత్రులు జాణలు భక్తు లల్పులే?

204


మ.

[2]అరుదా స్థావరలింగమూర్తు లిలఁ దారాదానదానస్థితిన్
నరులం దమ్ము భజించువారలను బుణ్యప్రాప్తులం జేయుట
ట్లరుదే జంగమలింగమూర్తు లిలఁ దారాదానదానక్రియే
తరు లై మర్త్యులు దమ్ముఁ జూడఁగనుమాత్ర న్ముక్తిఁ బొందింపఁగన్.

205


మ.

అనపేక్షావిధి నైన భక్తులను దా రల్లంతటం గాంచు మా
త్రన గమ్యాగమనోత్కటప్రకటహత్యాపాతకానేకకో
ట్లు నివృత్తం బగు నన్న సంస్పృహగుణాటోపంబునన్ స్వాగతా
సన[3]పాద్యాదు లొనర్చువారికిఁ బునర్జన్మంబు దా శ్లాఘ్యమే?

206
  1. కాల
  2. అరుదే
  3. భాగ్యా