పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

అనుభవసారము


శివధర్మకథాసక్తులు
సవిశేషాభీష్టఫలదసద్గురుభక్తుల్.

195


క.

చిరతరకృపాసముద్రులు
కరుణాభరణాన్వితులు విగతదారిద్ర్యుల్
నిరవధికలియుగరుద్రులు
హరచరణారాధకులు నిరంతరభద్రుల్.

196


క్రౌంచపదవృత్తము.

భక్తివినీతుల్ యుక్తిసమేతుల్ భవభయ[1]విగళితపశుగుణపూతుల్
వ్యక్తసుబుద్ధుల్ శక్తిసమృద్ధుల్ వ్యపగతకులచయవరసుఖసిద్ధుల్
సూక్తిరసజ్ఞుల్ భక్తివిధిజ్ఞుల్ సురుచిరశుభకరసుకృతమనోజ్ఞుల్
భుక్తివిరక్తుల్ ముక్తినియుక్తుల్ పురహరభక్తుల్ బుధవినుతమతుల్.

197


మాలినీవృత్తము.

సకలజనవరేణ్యుల్ శాశ్వతాగణ్యపుణ్యుల్
నికృతదురితవర్తుల్ నిర్మలానందమూర్తుల్
వికృతరహితవేషుల్ వేదవేదాంతభాషుల్
ప్రకటితసుమనస్కుల్ భక్తు లుద్యద్యశస్కుల్.

198


వనమయూరవృత్తము.

ధీరులు పరాపరవిధేయు లసహాయుల్
శూరులు మనోగమనశుద్ధులు ప్రబుద్ధుల్
వీరులు మహోద్ధతవివేకు లతిలోకుల్
శూరులు శ్రుతిస్ఫురితసూక్తు లిల భక్తుల్.

199
  1. నిపతిత