పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

31


చ.

మృడుకృప లేక భక్తిఁ దరమే పడయంగ ననంగ నేల మున్
వడిగొని క్రేఁపు ప్రీతిఁ గుడువన్ గుడువన్ మొద వంతఁ జేఁపున
న్వడువున భక్తుఁ డర్థఁ గొలువన్ గొలువన్ శివుఁ డిచ్చు భక్తి గా
కెడపునె యట్లు గాన కొలు వెంతయు మేలుర సద్గుణాకరా!

104


అయ్యెడినో కాదో కా
దయ్యెడినో యనుచు సంశయం బుడిగి శివున్
నెయ్యం బెలర్పఁ గొలిచిన
యయ్య కవశ్యమును భక్తి యగుఁ ద్రిపురారీ!

105


క.

సచ్చరితుం డై నడవక
యిచ్చునె తనుఁ జేరి కొలువ కిల నరపతియున్
సచ్చరితుం డై నడవక
యిచ్చునె తనుఁ జేరి కొలువ కీశుం డనఘా!

106


క.

భక్తుల నవమానింపమి
భక్తుల కరయంగ భక్తి భక్తికి మీఱన్
భక్తులకుఁ గాదు కావున
భక్తులకుం గర్త భక్తి భక్తినిధానా!

107


క.

భక్తుఁడు [1]తా నై చను స
ద్భక్తుండును దక్కుభక్తిపరు లెల్లను సు
వ్యక్తిగ శివరూపమ యని
భక్తినిరంతరమహానుభవసుఖవార్థీ!

108
  1. తానై నిను సద్భక్తుండును దక్క