పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

23


నవరసైకరసికుఁ డవివేకదూరుండు
భక్తుఁ డొక్కరుండె ప్రస్తుతింప.

61


క.

కష్టభవ మొల్ల ననియెడి
శిష్టాచారంబుకలిమిఁ జెప్పఁగఁ దరమే?
దుష్టేంద్రియవిజయత్వం
బిష్టమతిం బడయలేనియెడఁ ద్రిపురారీ!

62


క.

ఇంద్రియపరవశుఁ డధముం
డింద్రియనిగ్రహఁడు భక్తియెడ మధ్యముఁ డౌ
నింద్రియజయుఁ డుత్తముఁడు శి
వేంద్రియసంధాయకుఁడు మహేశుఁడు కాఁడే?

63


క.

పంచేంద్రియముల మదిఁ [1]దూ
లించి మనోగతియు లింగలీనంబుగ భా
వించిన భక్తుం డటు గా
కించుక మఱచినను భక్తుఁడే? త్రిపురారీ!

64


క.

విగ్రహసకలేంద్రియముల
నిగ్రహలీలానిరూఢి నిలుచునది సదా
నుగ్రహశివపదవశవిష
యగ్రహణసుఖంబు దొరకు నంతకు నియతిన్.

65


క.

సద్భక్తు లెల్లఁ దనయు
ద్యద్భయభక్తికిని మెచ్చ నాత్మేశుఁడు తా
సద్భావమునకు మెచ్చ జ
గద్భరితగుణా[2]ఢ్య! నడవఁగావలయు మహిన్.

66
  1. సేవించి
  2. ఢ్యునట్ల గా