కాశీనాథ త్రియంబక తిలాంగు
207
గారు తనకొంటి యభిప్రాయమును మార్చుకొనియెను. దేశాధిపతులు ప్రజలను సర్వ విధముల గాపాడవలసిన భారము వారిపై నున్నదిగనుక దురాచారము చేత బాధపడు ప్రజలనుగూడ రక్షింప వలసిన దేయని యాయన యభిప్రాయము, అందుచే దురాచారముల నడచు చట్టముల నేర్పరుచుటలో దొరతనమువారు మంచిపనియే చేసెనని యాయన సంతోషించెను. బొంబాయి నగరమునందు స్థాపింపఁ బడిన స్త్రీపునర్వివాహ సంఘమునకు సభాధ్యక్షుఁడుగా నుండెను. సంఘసంస్కారముమీఁద నభిమాన మెంతయున్నను తిలాంగు తన సంస్కారపద్ధతుల నాచరణలోనికిఁ దెచ్చినవాఁడు కాఁడు. అతిబాల్యవివాహ లిష్టములేకున్నను 1893 వ సంవత్సరమున నితఁ డెనిమిదేండ్ల వయసుగల తనకూఁతునకు వివాహము చేసెను. హిందూదేశస్థు లనేకులు లిదివిని యైకకంఠ్యముగ వానినధిక్షేపింప నప్పు డాయన తానుచేసినది తప్పే యనియుఁ దనశరీరస్థితి చెడిబోవుటచే తాను బ్రతికియుండగానే కూఁతురు వివాహముచేయ వలయునని యట్లు చేసితిననియుఁ జాల విచారించెను. "ప్రమాదో ధీమతామని" యన్నట్టు లెంతవారికైన లోపము లుండకపోవుగదా ఇదితప్ప యతనియం దేవిధమయిన లోపములు లేవు. ఈయనమరణమువల్ల హిందూదేశమున కంతకు గొప్పనష్టము గలిగెనని జనులు భావించిరి.