పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/249

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
206
మహాపురుషుల జీవితములు

నిందుదహరించుచున్నాము. "తిలాంగు విషయమున నేను చెప్పవలసిన ముఖ్యాంశ మొకటున్నది. హిందువులలో నిప్పుడనేకు లింగ్లాండు మొదలగు దేశములకుఁ బోయిరి. అచ్చట నాగరికతను జనుల యాచారము లను వ్యవహారధర్మములను స్వయముగ జూచి నేర్చికొను చున్నారు. తిలాంగు స్వదేశము నెన్నడు విడిచిపెట్టకపోయిన కేవలము పాశ్చాత్యుల గ్రంథముల సహాయముననే వారి యాచార వ్యవహారాదులను నాగరికతను జూచిన వారికంటె నెక్కుడుగ గ్రహించెను. ఈయన స్వదేశమగు బొంబాయి రాజధానిని దరచుగ విడిచియుండ లేదు. నేనెఱిఁగినంత వఱకీయన స్వదేశమునునొక్కసారి మాత్రము విడిచెను. ఈ విధముగ నతఁడు పశ్చిమదేశ గ్రంథములు జదివి ప్రాగ్దేశాచారముల నవలంబించి ప్రవర్తించుటచే జనులకందఱ కతఁడు సర్వదా దుష్టుఁడై మెలంగెను. ఈతని మరణముచేత హిందూదేశ మంతయు మహా నష్టమును బొందినది."

కాశీనాథతిలాంగు న్యాయవాదియై యుండుట రాజకీయ వ్యవహారములలో బ్రవేశించి ప్రతిష్టగాంచుట మొదలగు పనులతోనే కాలము బుచ్చక సంఘ సంస్కారముపై చాలనిష్ట గలిగియుండెను. హిందూ వితంతువు వైధవ్యమును గూర్చి యాయన పలుమారు దుఃఖించెను. అతి బాల్యవివాహములు వానికిష్టము లేదు. ప్రస్తుతము హిందూ దేశమందున్న వర్ణభేదము దేశమున కరిష్టదాయకమని యతఁడు తలంచెను. అతడు చనిపోవుటకు ముందు పదియేండ్లక్రిందట వఱకు దొరతనమువారు మన సంఘవిషయములలో జోక్యము కలుగ జేసికొనగూడదని యభిప్రాయపడుచు వచ్చెను. కాని యిటీవల 1800 వ సంవత్సరమందు 12 సంవత్సరముల లోపు బాలికలకు గర్భాధానము చేయఁగూడనని దొరతనమువారు చట్టము నేర్పరచే నప్పుడు హిందువులంద రదికూడదని వాదించుచుండ నప్పుడుతిలాంగు