కాశీనాథ త్రియంబక తిలాంగు
205
మయినది. 1880 వ సంవత్సరమున దొరతనమువారీయనను బొంబాయి హైకోర్టు జడ్జిగా నేర్పరచిరి. ఈ యుద్యోగమున కీయన సర్వవిధములచేతఁ దగినవాఁడని యాకాలమునఁ దెల్లవారు నల్లవారు నను భేదము లేక యెల్లవారుం గొనియాడిరి. అతఁడెంత మంచి న్యాయాధిపతియో వానితూర్పు లెంతశాస్త్రబద్ధములుగ నెంత యుక్తి యుక్తములుగ నున్నవో వానిని జదివిన వారందఱు నెఱుంగుదురు. హిందూ దేశములో రాయల్ ఏషియాటిక్కు సొసయిటీలనుపేర కొన్ని సమాజములు గలవు. సంస్కృతము మొదలగు ప్రాగ్దేశవిద్యలను గూర్చి పరిశ్రమ జేయుటయు తామ్రశిలాశాసనాదులత్రవ్వించి చక్క జేయుటయు నీ సభయొక్క ముఖ్యోద్దేశము. ఈ సమాజ మొకటి కలకత్తాలోను మఱియొకటి బొంబాయిలోనుగలదు. బొంబాయిలో నున్న సభకు శ్రీతిలాంగుగారిని దక్కినసభికు లగ్రాసనాధిపతిగ జేసిరి. ఈగౌరవము నల్లవారి కెవ్వరి కదివఱకు గలిగియుండలేదు. అతఁడు హైకోర్టుజడ్జియై దొరతనమువారి కొలువులోఁ బ్రవేశించినను దేశీయమహాసభమీఁద నాతనికిగల యభిమానము రవంతయేనియుఁ గొఱత వడదయ్యె. 1892 వ సం|| రాంతమందు వాని దేహస్థితి చెడి పోయెను. అది మొదలొక సంవత్సరము రోగపీడితుఁడై 1893 వ సంవత్సరము సెప్టెంబరు 1 వ తారీఖున నీమహాపురుషుఁడు లోకాంతరగతుఁ డయ్యెను.
అతని మరణమునుగూర్చి తెల్లవారు నల్లవారు ననుభేదము లేక హిందూదేశస్థులగు జనులందఱు మిక్కిలి దుఃఖించిరి. ఈసచ్చరిత్రుని జ్ఞాపకార్థము బొంబాయి నగరములో నొక పెద్ద సభ చేయబడెను; ఆసభ కప్పటిగవర్నరుగారగు హారిసుప్రభువుగా రగ్రాసనాధిపత్యము వహించిరి. ఆ కాలమున బొంబాయి హైకోర్టులో మొదటి జడ్జీగారు నీలాంగును గూర్చి చెప్పిన మాటలలో గొన్నిఁటి